Tuesday, January 31, 2023
More
  Homelatestపొంగులేటి రూటు మార్చినట్లేనా!

  పొంగులేటి రూటు మార్చినట్లేనా!

  • ఈనెల 18న శ్రీనివాసరెడ్డి అమిత్ షా భేటీ

  విధాత‌: ఖమ్మం బీఆరెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టైం దగ్గర పడినట్లే ఉంది.. డాక్టర్ రాసింది.. రోగి కోరింది ఒకే తరహా పథ్యం అయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రయాణం కుదిరింది. పార్టీలో అసమ్మతి ని..వేర్వేరు గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గరం గరం అవ్వడం.. ఆ వెనువెంటనే భద్రతను.. పైలట్ వాహనాన్ని.. ఇంటి దగ్గర సెంట్రీని తొలగించడం జరిగిపోయాయి.

  దీంతో ఇలాంటి పరిణామాలు కోసమే ఎదురు చూస్తున్న పొంగులేటి ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లిపోయేందుకు సరైన కారణాన్ని దొరక బుచ్చుకున్నట్లు అయింది. త్వరలోనే ఆయన అమిత్ షా తో భేటి అవుతారని ఆ తరువాత సహచరులతో బాటు బీజేపీలోకి చేరుతారని అంటున్నారు.

  ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
  ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు జనవరి 1న ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో తుమ్మల నాగేశ్వర్ రావు వర్గం పాల్గొనలేదు.

  వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతో ఇక్కడి పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్లు తేలిపోయింది. ఇక ఆత్మీయ సమ్మేళనంలో శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనను నమ్ముకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చే బాధ్యత నాదే అని అన్నారు.

  ఆ తరువాత తనకు సెక్యూరిటీ తగ్గించిన నేపథ్యంలో పొంగులేటి మరోసారి తాను త్వరలో కురుక్షేత్ర యుద్ధం చేస్తానని ప్ర‌క‌టించారు. రాజకీయ నాయకులకు ప్రజల దీవెనలు ఉండాలని అప్పుడే వారు రాణించగలుగుతారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తనను ఎప్పుడూ కోరుకుంటార‌ని అన్నారు.

  ఇదిలా ఉండగా అటు బీజేపీ నాయకులు సైతం సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీలో చేరుతారని సంకేతాలు ఇవ్వడంతో పొంగులేటి చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ లోని కీలక నాయకులతో సంప్రదింపులు చేశామని చెబుతున్న కమలనాథులు త్వరలో కీలక నాయకులను చేర్చుకుంటామని అన్నారు.

  ఇందులో భాగంగా పొంగులేటితో ఆ ప్రయాణం మొదలవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ముందుగా బీఆర్ఎస్ నాయకులపై వల వేయడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జనవరి 18న శ్రీనివాసరెడ్డి అమిత్ షా ను కలుస్తారని అంటున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular