Ponniyin Selvan-2 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్-2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవానికి మే 26న చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నది. అయితే, సినిమా చూడాలంటే రూ.399 చెల్లించాలన్న నిబంధనను తీసుకువచ్చారు. తాజాగా ఇవాళ్టి (జూన్2) నుంచి ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో ప్రైమ్ యూజర్లందరూ సినిమాను చూసేందుక వీలున్నది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల […]

Ponniyin Selvan-2 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్-2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవానికి మే 26న చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నది. అయితే, సినిమా చూడాలంటే రూ.399 చెల్లించాలన్న నిబంధనను తీసుకువచ్చారు.
తాజాగా ఇవాళ్టి (జూన్2) నుంచి ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో ప్రైమ్ యూజర్లందరూ సినిమాను చూసేందుక వీలున్నది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్‌కు వచ్చింది. గతేడాది పొన్నియన్ సెల్వన్-1 విడుదల కాగా.. ఈ సారి పార్ట్-2ను ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ తారాగణంతో తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది.
అయితే, తొలిభాగంలో వచ్చినంత మాత్రం కలెక్షన్లను పార్ట్-2 రాబట్టలేకపోయింది. మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించగా.. విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.
పీఎస్-2 విడుదలకు ముందు పెద్దగా బజ్ లేకపోవడం వసూళ్లపై ప్రభావం చూపింది. రూ.400 కోట్ల మార్క్‌ను సైతం అందుకోవడం కష్టంగానే అనిపిస్తున్నది. ఇటీవల మేకర్స్ పీఎస్-2 రూ.300కోట్లు వసూళ్లు రాబట్టినట్లు ప్రకటించారు. ఈ ఏడాదికి తమిళంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ ఏడాది కోలీవుడ్‌లో విడుదలైన చిత్రాల్లో పీఎస్-2 అత్యధిక గ్రాస్‌ను అందుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు విజయ్ నటించిన వారిసు(తెలుగులో వారసుడు) ముందుండగా.. తాజాగా ఈ రికార్డును పొన్నియన్ సెల్వన్-2 బ్రేక్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
