విధాత: దక్షిణాదిలోనే కాక బాలీవుడ్లో కూడా అందరికీ సుపరిచితమైన పేరు పూజా హెగ్డే. ఈమె 2012లో ఓ తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్గా పూజా హెగ్డే కొనసాగుతోంది.. అయితే ఈ భామకి గత ఏడాది మాత్రం ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఏడాది మొదట్లో విడుదలైన ప్రభాస్‌తో నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సరసన నటించిన బీస్ట్, ఎన్నో అంచనాలతో వచ్చిన చిరంజీవి -రామ్ చరణ్ కాంబినేషన్లో చేసిన ఆచార్య చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.
ఇక కిందటి ఏడాది చివరలో రణవీర్ సింగ్‌తో ఆమె కలిసిన నటించిన సర్కస్ చిత్రం డిజాస్టర్ కావడమే కాదు ఈ దశాబ్దపు అత్యంత చెత్త చిత్రంగా పేరు తెచ్చుకొంది. కాగా ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీకీ జాన్ చిత్రంతో పాటు మహేష్- త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి28 చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ బుట్ట బొమ్మ తాజాగా వివాహం చేసుకొనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి.
పూజా హెగ్డే పెళ్లి పీటలు ఎక్కనుందని.. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందనేలా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని మన పెద్దలు అంటారు. పాతికేళ్లలోపు వివాహం చేసుకోవడం ఉత్తమం. అది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి సరైన సమయం.
ఆ తరువాత గడిచే ప్రతి ఏడాది మనల్ని వృద్ధాప్యం వైపు తీసుకెళ్తున్నట్లే లెక్క. పూజా హెగ్డే ప్రస్తుత వయసు 32 సంవత్సరాలు. అంటే ఆమెకు పెళ్లి ఈడు కూడా ఏజ్ బార్ అయినట్టే. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు వివాహానికి నో అంటారు. టబు, శోభన వంటి వారు అసలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. అలాంటి తప్పు చేయనంటుంది పూజా హెగ్డే.
ఏది ఎలా ఉన్నా ఈ ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కాలని డిసైడ్ అయ్యిందట. అబ్బాయి కూడా ఫిక్స్ అయ్యాడని.. పూజాకు చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న తన మిత్రుడినే వివాహం చేసుకోనుందని సమాచారం. ఇప్పుడు ఆయన వ్యాపారవేత్తగా ఉన్నాడు. వీరి కుటుంబ సభ్యులు ఈ మేరకు మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నారనేలా ఒకటే వార్తలు. అయితే ఆమె పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు బయటికి రాలేదు. కానీ ఈ వార్త మాత్రం బాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.