Posani | ప్రముఖ నటుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఇప్పుడు సినిమాల కన్నా రాజకీయాలతోనే ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. ఆయన వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. టీవీ 5 సాంబశివరావుని కూడా ఓరెయ్ సాంబ అంటూ తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. అయితే రీసెంట్‌గా ఆయన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు […]

Posani |
ప్రముఖ నటుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఇప్పుడు సినిమాల కన్నా రాజకీయాలతోనే ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. ఆయన వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. టీవీ 5 సాంబశివరావుని కూడా ఓరెయ్ సాంబ అంటూ తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు.
అయితే రీసెంట్‌గా ఆయన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కడంపై మీ స్పందన ఏంటి అని పోసానిని ఓ జర్నలిస్ట్ అడడగగా, ఆయన దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. బన్నీ గొప్పతనం, ఆయనతో తనకి ఉన్న అనుబంధం గురించి తెలియజేశాడు.
బన్నీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పట్లో ఒకసారి నాకు ఫోన్ చేసి మురళీ గారు టీకి ఒకసారి మా ఇంటికి రండి అన్నారు. దాంతో ఆయన ఇంటికి నేను వెళ్లగా, నాకు ఒక ఎనవలప్ కవర్ తెచ్చి ఇచ్చారు. అది తెరచి తీసి చూస్తే రూ.5 లక్షల చెక్ ఉంది. ఏంటి బాబూ నాకు ఎందుకు చెక్ ఇచ్చావు అని అడిగితే పర్వాలేదు ఉంచండి అని అన్నాడు.
బాబు నేను ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా నాకు ఎందుకు ఇస్తున్నావని అంటే అప్పుడు బన్నీ.. మీరు డబ్బులని చాలా పొదుపుగా వాడతారు. అది నాకు ఎంతో నచ్చింది. ఎంతో మందికి గుండె ఆపరేషన్స్ కూడా చేయించారు, ఈ రూ.5 లక్షలు కూడా మంచి పనికి వాడతారని ఇచ్చానే తప్ప మరో కారణం లేదు.. దయచేసి తీసుకోనని మాత్రం అనవద్దు అని బన్నీ అన్నట్టు పోసాని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ చెక్ తీసుకొని మంచి పనికి ఉపయోగించినట్టు పోసాని పేర్కొన్నాడు. పదో తరగతి పాసై చదువు కునే స్తోమత లేని ఒక ముగ్గురుని ఎంపిక చేసుకుని వారికి ఆ డబ్బులు ఇచ్చాను. డిగ్రీ వరకు చదువుకో వాలంటే ఎంత ఖర్చవుతుంది అని అడగగా, వారు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు అవుతుందంటే వాళ్ల ముగ్గురికీ లక్షన్నర చొప్పున చెక్కులు అందించా, ఖర్చుల కోసం మరో రూ.10 వేలు చొప్పున ఇచ్చాను.
ఈ సాయం చేసినందుకు నాకు వాళ్లంతా ధన్యవాదాలు చెబుతుంటే, ఈ సాయం నేను చేయలేదు.. అల్లు అర్జున్ చేశారు.. ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అంటూ అతనికి లైవ్‌లో చెప్పించానని పోసాని అన్నారు. అయితే బన్నీ సాయం గురించి విషయం బయటకు రావడంతో ఇలా చేశారేంటని ఆయన నన్ను అడిగితే.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిదా? నువ్వు చెక్ ఇస్తే నేను సాయం చేసినట్టు నేను చాలా గొప్పోడిని అనిపించుకోవడం నాకు మింగుడు పడదయ్యా.. అందుకే నీ పేరు చెప్పాను’ అని బన్నీతో తాను అన్నట్టు పోసాని స్పష్టం చేశారు.
