Prabhas విధాత‌: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ‘మిర్చి, డార్లింగ్, mr పర్ఫెక్ట్’ సినిమాలతో అమ్మాయిల మనసులో డార్లింగ్‌గా నిలిచిపోయాడు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకు న్నాడు. ప్రభాస్ రేంజ్ ఏంటీ అంటే.. ఇప్పుడాయన ఓకే అంటే చాలు 100 కోట్లు ఇవ్వడానికి క్యూ కట్టేస్తారు. ప్రస్తుతం ప్రభాస్ నటించే సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే.. వాటికి […]

Prabhas

విధాత‌: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ‘మిర్చి, డార్లింగ్, mr పర్ఫెక్ట్’ సినిమాలతో అమ్మాయిల మనసులో డార్లింగ్‌గా నిలిచిపోయాడు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకు న్నాడు. ప్రభాస్ రేంజ్ ఏంటీ అంటే.. ఇప్పుడాయన ఓకే అంటే చాలు 100 కోట్లు ఇవ్వడానికి క్యూ కట్టేస్తారు.

ప్రస్తుతం ప్రభాస్ నటించే సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే.. వాటికి ఆయన రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లకి పైమాటే. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత వచ్చిన సినిమాలు అంతగా హిట్ అవ్వకపోయిన ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధమవుతోంది.

అయితే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉండిపోవడమే ఫ్యాన్స్‌కి బాధని కలిగిస్తుంది. ఇంత వయసు వచ్చిన ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మాత్రం తెలియడం లేదు. దీంతో అసలు ప్రభాస్ వయసు ఎంత అనే ఆరాలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే.. ఇంకో రెండూ మూడేళ్లు ఇలా సాగదీస్తే.. ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ కూడా మాట్లాడటం మానేస్తారు.

ఆ మధ్య కాలంలో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం ఉందని… పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వారిద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూనే వచ్చారు. ‘ఆదిపురుష్’ సినిమా సమయంలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలని కూడా ఇద్దరూ ఖండించారు.

ఇక ‘ఆదిపురుష్’ రిలీజ్ సమయంలో ప్రభాస్ మాట్లాడుతూ.. త్వరలో పెళ్లి చేసుకుంటానని… అది కూడా తిరుపతిలోనే చేసుకుంటాను అన్నారు. దాంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. కానీ ఇప్పటి వరకు పెళ్లి గురించి ప్రస్తావన రానే లేదు. అసలు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటా? అని అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

ఇదిలా ఉండగా రీసెంట్‌గా ప్రభాస్ ఆధార్ కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో ప్రభాస్ 1979లో జన్మించినట్లుగా ఉంది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటికి ప్రభాస్ వయసు 40కి పైనే ఉంటుంది. ఇంత వయసు పైబడుతున్నప్పటికీ ఎందుకని పెళ్లి చేసుకోవడం లేదు.. అసలు పెళ్లి చేసుకుంటాడా?.. లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం విశేషం.

Updated On 10 Sep 2023 4:52 PM GMT
somu

somu

Next Story