Tuesday, January 31, 2023
More
  Homelatestప్రభాస్ అడ్వాన్స్ తిరిగిచ్చేశాడట.. RRR నిర్మాతకు గోల్డెన్ ఛాన్స్ మిస్

  ప్రభాస్ అడ్వాన్స్ తిరిగిచ్చేశాడట.. RRR నిర్మాతకు గోల్డెన్ ఛాన్స్ మిస్

  విధాత: ప్రస్తుతం ఇండియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే దేశవ్యాప్తంగా వినిపించే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కంక్లూజన్‌తో ఆయన రేంజ్ పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. ఆ తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశ పరిచినా.. ప్రభాస్ ఫ్లాప్ చిత్రాలకు వచ్చిన కలెక్షన్లు ఇతర స్టార్ హీరోలా హిట్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లతో సరి సమానంగా ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు.

  ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. ఓవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌, కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్‌’, నాగ్ అశ్విన్‌తో చేస్తోన్న క్రేజీ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ కె’ అయితే ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ అంటున్నారు.

  మరోవైపు ఈయన చిన్న బడ్జెట్లో మారుతీ దర్శకత్వంలో హారర్ థ్రిల్ల‌ర్ కామెడీ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ తో చేస్తున్నాడు. ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రూపొందుతోంది. ఇది కాకుండా ‘స్పిరిట్’ చిత్రం కూడా ఆయన చేయాల్సి ఉంది.

  ఇదిలా ఉండగా.. త్వరలో అయిన దిల్ రాజు నిర్మాతగా మరోసారి కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంతి నీల్‌తో క‌లిసి ‘స‌లార్’ తర్వాత ‘రావణం’ అనే చిత్రం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారితో బాలీవుడ్ క్రేజీ ద‌ర్శ‌కుడు సిద్దార్ద్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు అఫీషియ‌ల్ ప్రకటన కూడా వచ్చింది. ఇలా ఈయన వ‌రుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు.

  అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో ఓ చిత్రం చేయాలని ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఓకే అంటే చాలు అడ్వాన్స్ ముందుగానే ఇచ్చి.. ఆయన ఎన్నేళ్ల తర్వాత అయినా సినిమాలు చేస్తానని మాట ఇస్తే చాలని ఆరాట పడుతున్నారు.

  కానీ ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన డివివి దానయ్య కాస్త తొందరపడ్డాడు. గతంలో దానయ్య తన బ్యానర్లో ప్రభాస్ హీరోగా నటించే చిత్రం కోసం ఆయనకు కొంత అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఐదేళ్లయినా ఆ చిత్రం అతీగ‌తీ లేదు. చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ డివివి ప్రాజెక్టుకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నాడు.

  ఎంతో కాలం ప్రభాస్ కోసం ఎదురుచూసిన దానయ్య ఓపిక నశించి ప్రభాస్‌ని అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయ‌మని అడుగుతున్నా. ప్రభాస్‌కి అడ్వాన్స్ ఇచ్చి ఐదేళ్లు అవుతుందని.. ఈ ఏడాదిలోపు తన సినిమాకి డేట్స్ ఇవ్వకపోతే అడ్వాన్స్‌కి వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని డివివి దానయ్య ప్రభాస్‌కి చెప్పాడట.

  దానయ్య అండ్ టీం ప్రభాస్ తో అలా మాట్లాడటం ప్రభాస్‌కు నచ్చలేదు. వెంటనే తన దగ్గర క్యాష్ లేకపోయినా తన అన్నయ్య ప్రబోధ్‌ దగ్గర డబ్బులు అప్పు చేసి దానయ్యకి తిరిగి ఇచ్చేశాడని సినీ వర్గాలు అంటున్నాయి. కాస్త ఓపిక పట్టి దానయ్య ప్రభాస్ చిత్రం కోసం ఎదురు చూస్తే బాగుండేదని, ఐదేళ్ల కిందట ప్రభాస్ కేవలం యంగ్ రెబల్ స్టార్ మాత్రమే అని.. ఆయన నాడు తెలుగు ప్రేక్షకులకే పరిచయం కానీ నేడు ఆయన పాన్ ఇండియా స్టార్. దేశ విదేశాలలో ఆయనకు క్రేజ్ ఉంది కాబట్టి ఇలాంటి అరుదైన అవకాశం దానయ్య మిస్ చేసుకున్నాడని.. ఆయన తొంద‌ర‌ పడ్డాడని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular