విధాత: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. అదే సమయంలో ఆయన పలు చిత్రాలతో బిజీగా ఉండడమే కాకుండా అటు పెళ్లికి సంబంధించిన విషయాలు పుకార్లుగా చక్కర్లు కొడుతూ ఉంటే వాటితో కూడా సతమతమవుతూ ఉన్నాడు.
అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొద్ది కాలం క్రితమే ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఈ షో తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అయ్యింది.
ప్రభాస్‌తో పాటు గోపీచంద్ కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ నోటి నుంచి బాలయ్య తన ప్రశ్నల ద్వారా పెళ్లితోపాటు మరెన్ని రహస్యాలను రాబడతాడో చూడాలని వారు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ ఒక టాక్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి. పైగా బాలకృష్ణతో ప్రభాస్ కలయిక అంటే సాధారణంగా అంచనాలు ఉండడం సహజం. అలా అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్‌ను 30వ తారీఖున ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ముందు అనౌన్స్ చేశారు.
అయితే ఇక్కడే ఆహా మీడియా మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ ట్విస్ట్ ప్రభాస్ అభిమానులందరూ షాక్ అయ్యేలా చేసింది. ఈ ఎపిసోడ్‌ను ఒక భాగంగా కాకుండా బాహుబలి తరహాలో రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది కూడా పక్క పక్క రోజుల్లో కాకుండా మొదటి భాగం 30వ తేదీన రానుండగా, రెండో భాగం జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
అయితే ప్రోమోలలో చూపిస్తున్న ఆసక్తికర ప్రశ్నలు, సమాధానాలు మొదటి పార్ట్ లో ఉంటాయా లేక రెండో భాగంలో ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. బాహుబలి మొదటి ఎపిసోడ్‌ను 30వ తేదీ కంటే ఒక రోజు ముందే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా మరో అప్డేట్ని ఆహా వర్గం వదిలింది. గురువారం రాత్రి 9 గంటల నుంచి ఈ ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది.
ఇక తాజా ప్రోమోలో ప్రభాస్, రాంచరణ్ తో కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడుతాడు. ఒరేయ్ చరణ్ నువ్వు నాకు స్నేహితుడివా? శత్రువా? అనే సంభాషణ మొదటి పార్ట్‌లో కాకుండా అది రెండో భాగంలో ఉండబోతోంది అంటున్నారు.
దాన్ని రెండో ఎపిసోడ్లో చూపిస్తే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న తరహాలోనే రెండో భాగంగా ఆసక్తి బాగా పెరుగుతుందని భావించిన నిర్వాహకులు తద్వారా రెండో పార్ట్‌కు వీక్షకులను కట్టిపడేసేందుకే ఇలా చేస్తున్నారని అర్ధమవుతోంది. దాంతో ఆహా ఈ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. అత్యంత వినోదంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఏ రేంజ్లో అలరిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
Content entha bagundante edit cheyadaniki evvaru oppukoledu, ade exclusive experience meeku andinchenduku "direct from the sets to play","Bahubali Episode in 2 parts." Mahishmathi Oopiri pilchuko, he is on the way🗡️🛡️
Have a blast this New year week.❤️🕺#PrabhasOnAha #Prabhas pic.twitter.com/2jynoaYOt5— ahavideoin (@ahavideoIN) December 28, 2022