Thursday, March 23, 2023
More
    HomelatestRRR: నాటు నాటు పాట‌కు ప్రభుదేవా స్టెప్పులేస్తే..

    RRR: నాటు నాటు పాట‌కు ప్రభుదేవా స్టెప్పులేస్తే..

    విధాత‌: ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu Song)ను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా రీల్స్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు కూడా చేశారు. అంతలా వైరల్‌ అయ్యింది ఆ పాట మరి. ఆ పాటకు కొరియోగ్రఫి చేసిన ప్రేమ్‌ రక్షిత్‌ స్టెప్పులు అంతలా అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ పాట ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడంతో దేశమంతా హర్షించిన సంగతి తెలిసిందే.

    మరి ఆ పాటకు ప్రభుదేవా స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? ఇండియన్‌ మైకెల్‌ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా గణేష్‌ మాస్టర్‌, ఆయన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం హీరో రామ్‌చరణ్‌తో కలిసి కేక్‌ కట్ చేశారు. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబోలో వస్తున్న సినిమాలోని ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫి చేస్తున్నట్లు సమాచారం. ప్రభుదేవా వేసిన ఆ స్టెప్పులు ఎలా ఉన్నాయో మీరూ ఓ లుక్కెయ్యండి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular