విధాత‌: తెలుగులో అనసూయ, సురేఖ వాణి, పవిత్ర లోకేష్, ప్రగతి వంటి ఆర్టిస్టులను కొంద‌రు సరదాగా ఆంటీ అంటూ సంబోధిస్తూ ఆటపట్టిస్తుంటారు. ఇక ప్రగతి విషయానికి వస్తే ఈమె ఒకప్పుడు భారతి రాజా దర్శకత్వంలో హీరోయిన్ గా కూడా నటించింది. తన కెరీర్ స్టార్టింగ్‌లో హీరోయిన్‌గా నటించిన ఈమె ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిర‌పడింది. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెద్దగా గుర్తింపు ఉండదు. ఒకవేళ వారి పాత్రలు, సినిమాలు కీలకమైన ఆ సినిమా వరకే వారిని […]

విధాత‌: తెలుగులో అనసూయ, సురేఖ వాణి, పవిత్ర లోకేష్, ప్రగతి వంటి ఆర్టిస్టులను కొంద‌రు సరదాగా ఆంటీ అంటూ సంబోధిస్తూ ఆటపట్టిస్తుంటారు. ఇక ప్రగతి విషయానికి వస్తే ఈమె ఒకప్పుడు భారతి రాజా దర్శకత్వంలో హీరోయిన్ గా కూడా నటించింది.

తన కెరీర్ స్టార్టింగ్‌లో హీరోయిన్‌గా నటించిన ఈమె ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిర‌పడింది. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెద్దగా గుర్తింపు ఉండదు. ఒకవేళ వారి పాత్రలు, సినిమాలు కీలకమైన ఆ సినిమా వరకే వారిని గుర్తుంచుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ పాత్రలతో ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్పటికీ తమ ముద్ర వేసుకుంటారు.

అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల‌లో నటి ప్రగతి కూడా ఒకరు. ఎక్కువగా త‌ల్లి పాత్ర‌లు చేసే ఈ బ్యూటీ ఆంటీ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళుతుంది. ఈమె సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎక్కువ మందికి దగ్గర అయింది.

తన జిమ్ వర్కౌట్ చేసే వీడియోలతో ప్రగతి నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. గ్లామ‌ర్ డోస్ ను కూడా అందిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె చేతిలో మందుగ్లాస్ పట్టుకొని జీవిత సత్యాలు చెబుతూ లేడీ దేవదాసుగా మారిపోయింది.

జీవితంలో ప్రతిరోజు, ప్ర‌తి నిమిషం ఎంజాయ్ చేయాలంటూ నీతులు చెబుతోంది. ప్రస్తుతం ఆమె మందు గ్లాసు చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ నటి మున్ముందు ఇంకా ఎలాంటి ఫోటోలతో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…!

Updated On 13 Jan 2023 4:15 PM GMT
krs

krs

Next Story