రాత్రికి రాత్రే మార్చేద్దామంటే సమస్యలే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ Prashant Kishor | న్యూఢిల్లీ: మంచి ఉద్దేశాలతో, నాలుగైదు సంవత్సరాల సంధిదశతో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ను తీసుకొస్తే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందని, అదే రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఇది ఒకప్పుడు దేశంలో 17-18 సంవత్సరాలు ఉన్నదని గుర్తు చేశారు. దేశంలో దాదాపు 25 శాతం ప్రజలు ఏటా ఏదో ఒక ఎన్నికల్లో […]

- రాత్రికి రాత్రే మార్చేద్దామంటే సమస్యలే
- ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్
Prashant Kishor | న్యూఢిల్లీ: మంచి ఉద్దేశాలతో, నాలుగైదు సంవత్సరాల సంధిదశతో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ను తీసుకొస్తే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందని, అదే రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఇది ఒకప్పుడు దేశంలో 17-18 సంవత్సరాలు ఉన్నదని గుర్తు చేశారు. దేశంలో దాదాపు 25 శాతం ప్రజలు ఏటా ఏదో ఒక ఎన్నికల్లో పాల్గొంటూనే ఉన్నారని, దీనితో ఆ ఎన్నికల్లోనే ప్రభుత్వం తలమునకలవుతున్నదని చెప్పారు.
#WATCH | On 'One Nation, One Election', Prashant Kishor says, "If this is done with the correct intentions and there be a transition phase of 4-5 years, then it is in the interest of the country. This was once in effect in the country for 17-18 years. Secondly, in a country as… pic.twitter.com/beTAZqf0Gl
— ANI (@ANI) September 4, 2023
దీనిని ఒకటి రెండు సార్లకు పరిమితం చేయగలిగితే.. అది చాలా ఉత్తమం అని ప్రశాంత్‌కిశోర్ అన్నారు. ఇది అనవసర ఖర్చును తగ్గించడమే కాకుండా.. ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కానీ.. రాత్రికిరాత్రే మార్చివేయాలనుకుంటే సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఎలాగూ ప్రభుత్వం బిల్లు తేబోతున్నది కనుక.. వేచి చూడాలని అన్నారు. ప్రభుత్వానికి మంచి ఉద్దేశాలు ఉంటే జమిలి మన దేశానికి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. అయితే.. ప్రభుత్వం ఏ ఉద్దేశాలతో దీనిని తీసుకువస్తుందనే దాని ఆధారపడి ఉంటుందని చెప్పారు.
