Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌మెదక్: టేబుల్ టెన్నిస్‌లో తృతీయ బహుమతి.. అభినందించిన ప్రతిమా సింగ్

  మెదక్: టేబుల్ టెన్నిస్‌లో తృతీయ బహుమతి.. అభినందించిన ప్రతిమా సింగ్

  విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుండి 8 వరకు హైదరాబాద్ లోని బండ్లగూడ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలు జ‌రిగాయి. టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి మెదక్ జిల్లా తృతీయ బహుమతి సాధించడంపట్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

  శుక్రవారం తన ఛాంబర్ లో గెలుపొందిన క్రీడాకారులు గబ్బుల అర్నీత్, రవితేజ, అనిష్, కిషోర్, నరేష్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ చారి, సాయి ప్రణీత్, నరేష్‌కు మెడల్స్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు.

  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రథ‌మ స్థానం తీసుకువచ్చేందుకు క్రీడాకారులు మరింత కృషి చేయాలని ప్రోత్సహించారు.

  కార్యక్రమంలో మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కె. ప్రభు, సభ్యులు మురళీధర్, జూలకంటి శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, విశ్రాంత పిడి ఆనందం, అంబుడ్స్ మెన్ అడ్వకేట్ శిరిగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular