- ప్రీతి మృతిపై అనేక ప్రశ్నలు
- వీడని చిక్కుముడులూ
- పైథాలజీ రిపోర్టుల కోసం ఎదురుచూపులు
అనేక ప్రశ్నలు. వీడని చిక్కుముడులు. హత్య ఆత్మహత్య అనే తీవ్ర చర్చ. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రీతి మరణంపై ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రీతి తండ్రి కొత్త కోణం బయటపెట్టారు. ప్రీతిది హత్యేనని, దీనికి సంబంధించి ఆధారాలు కూడా పోలీసులకు పంపించినట్లు తెలపాడు. సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ప్రీతి మృతిపై పైథాలజికల్ రిపోర్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, టాక్సీ కాలేజీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమైనా వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయా? అని చర్చ సాగుతుంది. ఇది ఇలా ఉండగా ప్రీతి ఆత్మహత్యకు పాల్పడలేదు సైఫే ఎదో హానికరమైన ఇంజక్షన్ ఇచ్చాడని ప్రీతి తండ్రి ఆరోపణ మరింత సమస్యను జటిలం చేయనున్నది. ఏది ఏమైనా ఈ సంఘటనలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక మెడికల్ విద్యార్థి ప్రాణాలు బలైపోయాయి.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రీతి ఇప్పుడా పేరు తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఆమె మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతిపట్ల అనేక అనుమానాలు, అపోహలు తలెత్తుతున్నాయి. ప్రీతి సంఘటనపై వాస్తవాలు ఎలా వెలుగు చూస్తాయో? అని ఆసక్తి నెలకొంది. తీవ్ర జటిలంగా మారిన ప్రీతి మృతిపై దర్యాప్తు సంస్థలు, లాబరేటరీ రిపోర్టర్లు, విచారణ కమిటీలు ఏమి తేలుస్తాయో? అనే చర్చ సాగుతుంది.
అదే సమయంలో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆమె మరణానికి బాధ్యులైన కాలేజీ యాజమాన్యం, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపడుతున్నారు. హెచ్‌వోడీ, కాలేజీ ప్రిన్సిపాల్‌నే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. వేధింపుల గురించి ప్రీతి కంప్లైంట్ చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి హత్య అంటూ తండ్రి నరేందర్ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి.
ప్రీతి ఇది హత్యా? ఆత్మహత్యా?
మారిన పరిస్థితి ప్రకారం ప్రతిదీ హత్యా? ఆత్మహత్యా? అనే మరో పీఠముడిపడింది. ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గత రెండు రోజుల నుంచి చెబుతున్నారు. ప్రీతి మృతి సంఘటన నేపథ్యంలో ఈ అంశం మరింత తీవ్రంగా మారింది. ప్రీతిని హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తండ్రి విమర్శిస్తున్నారు.
రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. మరోవైపు భిన్న వర్గాలు కాంగ్రెస్, జనసేన, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. కాలేజీ యజమాన్యంపై కూడా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పైథాలజీ రిపోర్టుల కోసం ఎదురుచూపులు
ప్రీతి మృతి సంఘటనపై పైథాలాజికల్ రిపోర్టులు, పోస్టుమార్టం రిపోర్టు, టాక్సీ కాలేజీ రిపోర్టు వీటిపై ఆధారపడి ప్రీతి కేసు మరో మలుపు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పోలీసుల దర్యాప్తులో ఇంకా ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే . ఎంజీఎం లో చికిత్స చేసిన వైద్యులు ప్రీతికి థైరాయిడ్ తో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నట్టు ఎలాంటి మార్పు లేదని సహచర విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో కళాశాల నియమించిన నలుగురు ప్రొఫెసర్ల కమిటీ నివేదికల్లో ఏమున్నాయో కూడా తేలాల్సి ఉంది. ఎంజీఎం వైద్యులు ప్రొఫెసర్ల కమిటీ నివేదికను ఇప్పటికే డిఎంఈ కి ఎంసీఏ కి పంపించారు ఇక పోలీసుల దర్యాప్తు, ల్యాబ్ రిపోర్టులు నిజాలను నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రీతి మృతి సంఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు సంక్లిష్టంగా మారింది.