Tuesday, January 31, 2023
More
  Homelatestపెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ని.. అలియా ఘట్స్‌కి హ్యాట్సాఫ్

  పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ని.. అలియా ఘట్స్‌కి హ్యాట్సాఫ్

  విధాత‌: ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతగా నటించిన అలియా భట్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరోయిన్ ఈమె. మొదటి నుంచి ఆధునిక భావాలతో పెరిగిన ఈమె తండ్రి మహేష్ భ‌ట్ కూడా అదే కోవకు చెందిన వాడే.

  ఇక అలియా భట్ ఆ మధ్యన రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న అలియా.. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ఇటీవల ఆమె నటించిన బ్రహ్మాస్త్రం కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

  ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండగానే తన సహా నటుడు, హీరో రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె 2022 ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకొని నవంబర్ నెలలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా పెళ్లయిన కొన్ని నెలలకే అలియా భట్ బిడ్డకు జన్మనివ్వడంతో ప్రెగ్నెన్సీ విషయంలో అందరికీ ఎన్నో సందేహాలు వచ్చాయి.

  అలియా భట్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందని ప్రెగ్నెంట్ అని తెలియడంతోనే హడావుడిగా పెళ్లి చేసుకున్నారంటూ బాలీవుడ్ మీడియా కూడా కోడైకూసింది. ఈ వార్తలపై తాజాగా అలియా భట్ స్పందించింది. ఆమె ఓపెన్ గా అసలు విషయాన్ని చెప్పేసింది.

  అవును నేను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్‌ను. హాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. బేబీ బంప్‌తోనే నేను హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్స్ సీన్ల‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ విషయం యూనిట్ వారికి తెలియడంతో షూటింగ్ సమయంలో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

  వాస్తవానికి పాతకాలంలో పెళ్లికి ముందే తల్లి అయింది అంటే వారిని సమాజం నుండి వెలివేసేవారు. కానీ రాను రాను పరిస్థితి మారుతుంది. పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాల ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడ‌టంతో ఇప్పుడు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా.. సరొగసి విధానంలో తల్లి అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కామన్ అయిపోయింది. దీనికి సినీ హీరోయిన్లు కూడా ఓ కారణం. ఈ ట్రెండ్‌ ను పెంచి పోషించింది వారే అని కొంతమంది ఆరోపణ.

  గతంలో కూడా దివంగత ఎవర్ గ్రీన్ హీరోయిన్‌ శ్రీదేవి బోనీ కపూర్‌తో పెళ్లికి ముందే త‌ల్లి కావడంతో హ‌డావుడిగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల అమీజాక్సన్, నేహా దుపియా వంటి వారు కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్లు అయిన సంగతి చాలామందికి తెలిసిందే.

  మొత్తానికి అలియా భట్ ఇలా ఓపెన్ గా చెప్పడం మాత్రం ఆమె గట్స్ కు నిదర్శనమని.. ఇలా ఒప్పుకున్నందుకు ఆమెను అభినందించి తీరాలని కొందరు అంటుంటే.. ఇలా చేస్తూ పోతే ఈ ప్రభావం సమాజంలోని వారిపై తీవ్రంగా పడుతుందని సామాజిక బాధ్యత కలిగిన వారు దీనిని ఖండిస్తున్నారు. అయినా ఎవరి పర్సనల్ జీవితం వారిది అన్నట్లుగా మరికొందరు తీర్మానం చేస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular