Hyderabad విధాత: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఎనిమిది నెలల గర్భిణి పరీక్ష కేంద్రంలోనే మృతి చెందిన విషాధ ఘటన చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు శుక్రవారం గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చారు. పరీక్ష ప్రారంభ సమయం దగ్గర పడటంతో వేగంగా పరీక్ష కేంద్రంలోని గదికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. ఆమె వేగంగా వెళ్లిన క్రమంలో […]

Hyderabad

విధాత: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఎనిమిది నెలల గర్భిణి పరీక్ష కేంద్రంలోనే మృతి చెందిన విషాధ ఘటన చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు శుక్రవారం గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చారు.

పరీక్ష ప్రారంభ సమయం దగ్గర పడటంతో వేగంగా పరీక్ష కేంద్రంలోని గదికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. ఆమె వేగంగా వెళ్లిన క్రమంలో బీపీ పెరిగి చెమటలు పట్టి పరీక్ష గదిలోనే కుప్పకూలిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి భర్త అరుణ్ తీసుకెళ్లారు.

అయితే ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు దృవీకరించరు. గుండెపోటుతో ఆమె మృతి చెందిన ట్లుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాధిక మరణంతో ఆమె పిల్లలు వర్షిణి, కాత్యాయనిలు తల్లిని కోల్పోవడం ఆ కుటుంబంలో విషాధం నింపింది.

ఎస్‌ఐ పరీక్షలలో పరుగు పందెంలో యువకుడి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో నిర్వహించిన ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక ధారుడ్య పరీక్షలలో పరుగు పందెంలో పాల్గొన్న యువకుడు సొమ్మసిల్లి మృతి చెందాడు. రన్నింగ్ ఈవెంటులో పాల్గొన్నఅభ్యర్ధి మోహన్ సొమ్మసిల్లి పడిపోగా అతడిని వెంటనే గుంటూరుకు చెందిన జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లుగా తెలిపారు

Updated On 15 Sep 2023 1:28 PM GMT
somu

somu

Next Story