విధాత: నల్ల‌గొండ‌ పెద్ద ఆసుపత్రి మాత శిశు సంరక్షణ కేంద్రం ముందు కారు లోనే గర్భిణి ప్రసవించిన ఘటన చోటుచేసుకుంది. కట్టంగూరుకు చెందిన పోలబోని శంకర్ తన భార్య స్వప్నను నల్ల‌గొండ‌ ఆసుపత్రికి ప్రసవానికి తీసుకువచ్చారు. సిబ్బంది లోనికి తీసుకెళ్లేందుకు సకాలంలో స్పందించకపోవడం.. స్ట్రెచర్, వీల్ చైర్ తీసుకురావ‌డంలో ఆల‌స్యం చేయడంతో గర్భిణీ వచ్చిన కారులోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుప‌త్రి సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చి గర్భిణీని, బాబును ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు. ఈ ఘటన చూసిన […]

విధాత: నల్ల‌గొండ‌ పెద్ద ఆసుపత్రి మాత శిశు సంరక్షణ కేంద్రం ముందు కారు లోనే గర్భిణి ప్రసవించిన ఘటన చోటుచేసుకుంది. కట్టంగూరుకు చెందిన పోలబోని శంకర్ తన భార్య స్వప్నను నల్ల‌గొండ‌ ఆసుపత్రికి ప్రసవానికి తీసుకువచ్చారు. సిబ్బంది లోనికి తీసుకెళ్లేందుకు సకాలంలో స్పందించకపోవడం.. స్ట్రెచర్, వీల్ చైర్ తీసుకురావ‌డంలో ఆల‌స్యం చేయడంతో గర్భిణీ వచ్చిన కారులోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం ఆసుప‌త్రి సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చి గర్భిణీని, బాబును ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు. ఈ ఘటన చూసిన ఆసుపత్రిలో ఉన్న గర్భిణులు, వారి సహాయకులు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. పనితీరు పట్ల తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆసుప‌త్రి వైద్య సేవల దుస్థితి ఇలా ఉంటే త‌మ ప్ర‌స‌వాలు స‌జావుగా సాగుతాయో లేదో అని గ‌ర్భిణులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

బాధిత గర్భిణీ భర్త భరత శంకర్ మాట్లాడుతూ ప్రసవానికి వచ్చిన తన భార్యను సకాలంలో ఆసుపత్రిలోనికి తీసుకెళ్లలేకపోయారని.. కనీసం తల్లి, బిడ్డకైనా వారు మంచి వైద్యం అందించాలని కోరారు. అలా కాకుండా ఏ హాని క‌లిగినా వైద్యులు, సిబ్బంది బాధ్యత వహించాలన్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌ల వ‌ల్లే ప్ర‌భుత్వాసుప‌త్రికి వెళ్లాలంటేనే ప్ర‌జ‌లు భ‌యప‌డుతుంటారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ప్ర‌యివేట్ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు జ‌డిసి ప్ర‌భుత్వాసుప‌త్రికి వెళ్తుంటారు. అలాంటి వారికి కూడా స‌కాలంలో స‌రైన వైద్యం అందించ‌క‌పోతే వాటిని ఏర్పాటుచేసిన ల‌క్ష్యం ఎలా నెర‌వేరుతుంది.

ఆసుపత్రి సూపరరిండెంట్ ఈ ఘటన పై స్పందిస్తూ అనుకోకుండా గర్భిణీ కారులోనే ప్రసవించడం జరిగిందని, ఇక ముందు ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. హాస్పిటల్ ద్వారం వ‌ద్దే స్ట్రెచర్, వీల్ చైర్ ఏర్పాటు చేస్తామన్నారు. కారులో ప్రసవించిన గర్భిణికి, బాబుకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Updated On 21 Nov 2022 4:55 PM GMT
krs

krs

Next Story