విధాత: రాష్ట్రపతి దక్షిణాది విడిది ఈ ఏడాది కేవలం ఒక్క తెలంగాణకే పరిమితమైంది. ఏటా రాష్ట్రపతి శీతాకాలం విడిది కోసం దక్షిణాదికి వచ్చి హైదరాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తున్నది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచే దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించి, తన పర్యటన ముగించుకొని వెళ్లడం సంప్రదాయం. ఇప్పటి వరకు శీతాకాలం విడిది కోసం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రతి రాష్ట్రపతి ఇదే విధంగా పలు రాష్ట్రాలు పర్యటించి వెళ్లే వారు. […]

విధాత: రాష్ట్రపతి దక్షిణాది విడిది ఈ ఏడాది కేవలం ఒక్క తెలంగాణకే పరిమితమైంది. ఏటా రాష్ట్రపతి శీతాకాలం విడిది కోసం దక్షిణాదికి వచ్చి హైదరాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తున్నది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచే దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించి, తన పర్యటన ముగించుకొని వెళ్లడం సంప్రదాయం.

ఇప్పటి వరకు శీతాకాలం విడిది కోసం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రతి రాష్ట్రపతి ఇదే విధంగా పలు రాష్ట్రాలు పర్యటించి వెళ్లే వారు. కానీ ప్రస్తుత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిదిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించినట్లుగా ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది హైదరాబాద్‌కు వస్తూ వస్తూనే ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకొని వచ్చారు. మిగతా అన్ని రోజుల పర్యటన కేవలం తెలంగాణ రాష్ర్టంలోని ప్రాంతాలకే పరిమితమైంది. రాష్ట్రపతి పర్యటనలో ఒక్క శ్రీశైలం మాత్రమే ఏపీలో ఉన్నది. మిగతా ప్రాంతాలన్నీతెలంగాణలోనివే కావటం యాధృచ్చికం కాదు.

రాష్ట్రపతి శీతాకాల విడిది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావడం వెనుక మర్మమేమిటన్నచర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రీకరించిన బీజేపీ ప్రభుత్వంలోని పెద్దలు కావాలని రాష్ట్రపతి పర్యటనను తెలంగాణకు పరిమితం చేశారన్నఅభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తెలంగాణలో ఎక్కువ పర్యటనలు చేయడం ద్వారా, ఎక్కువ కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా బీజేపీ పరోక్షంగా లబ్ధి పొందడానికి అవకాశమున్నదని బీజేపీ పెద్దలు భావించినట్లు ఈ పర్యటన ఉన్నదంటున్నారు. రాష్ట్రపతి తన పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావాజాలానికి దగ్గరగా ఉండే కేశవ్‌ మెమోరియల్‌ స్కూల్‌తో పాటు, భద్రాద్రి, రామప్ప దేవాలయాలతో పాటు శ్రీ రామానుజాచార్య విగ్రహం, శ్రీరామచంద్ర మిషన్‌లను సందర్శిస్తారు.

అలాగే జాతీయ పోలీస్‌ అకాడమిలో శిక్షణ తీసుకుంటున్న ఐపీఎస్‌ అధికారులతో సంభాషిస్తారు. ఇదే తీరుగా జి.నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులతోనూ ఇంటరాక్ట్‌ అవుతారు. ఇలా కేవలం రాష్ట్రపతి పర్యటనను కేవలం తెలంగాణకే పరిమితం చేయడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది.

Updated On 28 Dec 2022 11:21 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story