రూ.60కోట్ల ప్రసాదు పథకం పనులు ప్రారంభం ఆక‌ట్టుకున్న‌సాంస్కృతిక ప్రదర్శనలు విధాత, వరంగల్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప ఆలయాన్ని బుధవారం సందర్శించి అక్కడి శిల్ప సంపదకు ముగ్దురాలయ్యారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణకు వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో భాగస్వామయ్యారు. దీనిలో భాగంగా బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంత‌కు ముందు భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో […]

  • రూ.60కోట్ల ప్రసాదు పథకం పనులు ప్రారంభం
  • ఆక‌ట్టుకున్న‌సాంస్కృతిక ప్రదర్శనలు

విధాత, వరంగల్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప ఆలయాన్ని బుధవారం సందర్శించి అక్కడి శిల్ప సంపదకు ముగ్దురాలయ్యారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణకు వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో భాగస్వామయ్యారు.

దీనిలో భాగంగా బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంత‌కు ముందు భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్ప చేరుకున్న రాష్ట్రపతికి హెలిపాడ్ వద్ద మంత్రులు అధికారులు ఘన స్వాగతం పలికారు.

పూర్ణకుంభ స్వాగతం

రామప్ప ఆలయంలో పూజారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే ( చీరను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్‌కు ఇచ్చారు.

ఆకట్టుకున్న రామప్ప శిల్ప సంపద

అనంతరం దేవాలయ శిల్పకళాకృతులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఇక్కడి శిల్ప సంపదను, సహజత్వం పోలిన శిలామూర్తులను ముర్ము వీక్షించారు. ఆలయ విశిష్టతను, ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల యునెస్కో గుర్తింపు, దేవాలయ అభివృద్ధి, పరిరక్షణ తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను అభివృద్ధి పథక వివరాలు తెలుసుకున్నారు.

ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్‌ వివరాలు, వరల్డ్‌ హెరిటేజ్‌ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కన్వీనర్‌ పాండురంగారావు వివరించారు. రామప్ప శిల్ప సంపద ఎంతో అద్భుతం గా ఉందని పొగిడారు.

రూ.62 కోట్లతో ప్రసాదు పథకం

ఈ సందర్భంగా రామప్ప అభివృద్ధికిగానూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం ద్వారా రూ. 62 కోట్లలతో చేపట్టనున్న పనులకు, కామేశ్వర ఆలయం, పునర్నిర్మాణ పనుల ప్రారంభ శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.

అల‌రించిన‌ సాంస్కృతిక ప్రదర్శనలు

గిరిజన ప్రాంతం ఏజెన్సీ జిల్లాగా గుర్తింపు పొందిన ములుగు రామప్పకు వ‌చ్చిన‌ సందర్భంగా గిరిజన కళాకారులతో సంప్రదాయ నృత్యాలతో రాష్ట్రపతి ద్రౌపదికి ఘన స్వాగతం పలికారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను , వీక్షకులను ఆకట్టుకున్నాయి.

పరమశివుని పై పరంపరా బృందం చేసిన ప్రదర్శన, మన సంస్కృతిని చాటే విధంగా కొమ్ముకోయ కళాకారుల బృందం సమ్మ‌క్క సారలమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది, అనంతరం బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అనే అన్నమాచార్య గీతం పై కళాకారులు ప్రదర్శించారు. గిరిజన కళాకారుల నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రామప్ప పర్యటనకు వచ్చిన రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఐటీడీఏ పీవో అంకిత్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పర్యటన అనంతరం అధికారులు హెలిపాడు వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు.

భారీ బందోబస్తు

రాష్ట్రపతి పర్యటన కోసం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా కలెక్టర్లు అనూప్, కృష్ణఆదిత్య నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతరావు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ధనసరి సీతక్క, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జ‌డ్పీచైర్మ‌న్లు కోరం కనకయ్య, కుసుమ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకుల హడావుడి

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా లోని భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో రామప్పకు తరలి వెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భాజపా నాయకులను పరిచయం చేయడం విశేషం.

Updated On 28 Dec 2022 1:50 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story