Sunday, December 4, 2022
More
  Homelatestభారమైన మనసుతో, దుఖంతో ఈ ప్రెస్‌మీట్‌: CM KCR

  భారమైన మనసుతో, దుఖంతో ఈ ప్రెస్‌మీట్‌: CM KCR

  విధాత: భారమైన మనసుతో, దుఖంతో ఈ ప్రెస్‌మీట్‌ నిర్వ‌హిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ మూల స్తంభాలను వాళ్లు లెక్కచేయడం లేదని మండి పడ్డారు. సీబీఐ, ఈడీ, సీవీసీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరినీ కోరుతున్నానని కేసీఆర్‌ అన్నారు.

  ఇంకా సీఎం మాట్లాడుతూ చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఈ దేశంలో నెల‌కొని ఉన్నాయని, ఈ దేశంలో దుర్మార్గం జ‌రుగుతుందని.. ప్ర‌జాస్వామ హ‌త్య నిర్ల‌జ్జ‌గా విశృంఖ‌లంగా, విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతోందన్నారు. ఈ ప్ర‌జాస్వామ్య హంత‌కుల యొక్క స్వైర‌విహారం ఈ దేశం యొక్క పునాదుల‌కే ప్ర‌మాదక‌రమని, అత్యంత భ‌యంక‌ర‌మైన‌ భాదాక‌ర‌మైన ప‌రిస్థితి అని కనీసం మ‌న ఊహాకు కూడా అంద‌దని ఆవేదన వ్యక్తం చేశారు.

  అందుకే బాధ‌తో మాట్లాడుతున్నాను. 8 ఏండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వ‌చ్చి దేశాన్ని అన్ని రంగాల్లో స‌ర్వ‌నాశ‌నం చేసింది. రూపాయి ప‌డిపోయింది. నిరుద్యోగం తాండ‌విస్తుంది. ఆక‌లి రాజ్యంగా మారుతోంది ఇండియా. అంత‌ర్జాతీయ సూచిక‌లు మంచి చెడును చూపిస్తున్నాయి. దేశ విభ‌జ‌న‌, ప్ర‌జ‌ల‌ను విభ‌జించడం.. భార‌త ప్ర‌జాస్వామ్య నాడీని క‌లుషితం చేస్తున్నాయి. చాలా దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పోతున్నారు. నేను కూడా బాధ‌కు గుర‌య్యానని కేసీఆర్ పేర్కొన్నారు.

  ఈ రోజు మునుగోడు పోలింగ్ ముగిశాకనే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో వెయిట్ చేశాను. మునుగోడులో కూడా వెకిలి ప్ర‌య‌త్నాలు చేశారు. చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్ర‌చారాలు చేశారు. పాల్వాయి స్ర‌వంతి త‌న‌ను క‌లిసిన‌ట్టు, కొన్ని టీవీల పేర్లు పెట్టి ప్ర‌చారం చేశారు. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి, పోతాయి. గెలుస్తం, ఓడి పోతం.

  హుజురాబాద్‌లో ఓట‌మి పాల‌య్యాం. దుబ్బాక‌లో స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయాం. నాగార్జున సాగ‌ర్‌, హుజుర్‌న‌గ‌ర్‌లలో గెలిచాం. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాలి. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంట‌ది. రాజ‌కీయాల్లో, ప్ర‌జాజీవితంలో సంయ‌మ‌నం ఉండాలి. చివ‌రికి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఫెయిల్ అయింద‌ని ఆరోపించారు. వారిని గెలిపిస్తే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మంచిది. ఓడగొడితే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఫెయిల్ అంట‌రు.

  బీజేపీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తోంది. ఓట‌మిని, గెలుపును ఏదైనా స‌రే స్వీక‌రించాలి. దుర్మార్గ ప‌ద్ధ‌తుల్లో ముందుకు పోతున్నారు. ఉద్య‌మ సంద‌ర్భంలో కూడా మేం ఇంత హేయంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఇంత దౌర్భాగ్య‌క‌రంగా వెళ్ల‌లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతుంది. ప్రజాస్వామ్యానికి మూల‌స్తంభాలుగా లెజిస్లేచ‌ర్, కార్య‌నిర్వ‌హ‌క‌ వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌, నాలుగోది ప్రెస్‌. వీట‌న్నింటిని ప‌క్క‌న పెట్టేశారు. ఎవ‌రినైనా బెదిరించ‌గ‌లం, ఏమైనా చేయ‌గ‌లం అని అనుకుంటున్నారు. ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి. ఎవ‌రు కూడా ఊహించ‌లేదు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page