Students | ఓ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. బడికి రాలేదని 50 మంది విద్యార్థులను పశువులను చితకబాదినట్లు బాదాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పాలము జిల్లాలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఓ 50 మంది విద్యార్థులు.. తమ గ్రామంలో నిర్వహించిన కలాష్ యాత్రకు హాజరయ్యారు. దీంతో సోమవారం ఆ విద్యార్థులందరూ స్కూల్‌కు హాజరు కాలేదు. మంగళవారం స్కూల్‌కు వచ్చిన ఆ […]

Students |
ఓ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. బడికి రాలేదని 50 మంది విద్యార్థులను పశువులను చితకబాదినట్లు బాదాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పాలము జిల్లాలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఓ 50 మంది విద్యార్థులు.. తమ గ్రామంలో నిర్వహించిన కలాష్ యాత్రకు హాజరయ్యారు. దీంతో సోమవారం ఆ విద్యార్థులందరూ స్కూల్‌కు హాజరు కాలేదు. మంగళవారం స్కూల్‌కు వచ్చిన ఆ 50 మందిని ప్రిన్సిపల్ పిలిపించుకున్నాడు. బడికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ వీపులపై కర్రతో చితకబాదాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులను ప్రిన్సిపల్ హెచ్చరించాడు. బాధిత విద్యార్థులంతా ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న వారే.
అయితే విద్యార్థులు ఆ దెబ్బలను భరించలేక, నొప్పితో బాధపడుతూ జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. బుధవారం పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లలను తాను కొట్టలేదని మీడియాకు ప్రిన్సిపల్ వెల్లడించాడు.
