విధాత: మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా తన నట జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్ గా చేసింది. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2002లో తమిళ‌న్ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ప్రియాంక చోప్రాను నాడు తెలుగులో పరిచయం చేయాలని పలువురు ప్రయత్నించారు. ఓ నిర్మాత ఆమెతో అపురూపం అనే చిత్రాన్ని ప్రారంభించారు కూడా. కానీ […]

విధాత: మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా తన నట జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్ గా చేసింది. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2002లో తమిళ‌న్ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ప్రియాంక చోప్రాను నాడు తెలుగులో పరిచయం చేయాలని పలువురు ప్రయత్నించారు. ఓ నిర్మాత ఆమెతో అపురూపం అనే చిత్రాన్ని ప్రారంభించారు కూడా. కానీ ఎందువలనో ఆ చిత్రం ఆగిపోయింది.

కాగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లెవెల్ లో ఫేమస్ అయ్యింది. అక్కడ వెబ్ సిరీస్ లో, సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె రామ్ చరణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన జంజీర్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం 2013లో విడుదల అయింది. ఆ టైంలోనే ఆమె ఆ చిత్రం కోసం ఏకంగా 20 కోట్లు పారితోషకం తీసుకొని వార్తల్లో నిలిచింది. ఇదే చిత్రం తెలుగులో తుఫానుగా విడుదలై డిజాస్టర్ అయ్యింది.

ఇక విషయానికి వస్తే తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు మామూలుగా లేవు. ఈ గ్లోబల్ హీరోయిన్ గురించి ఏ వార్త వచ్చినా వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈమె పోస్ట్ చేసిన గ్లామ‌ర్ ఫోటోలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందాలను ఎక్కడా దాచుకోకుండా విచ్చలవిడిగా వండి వడ్డిస్తూనే ఉంది. ఈమె లేటెస్ట్ ఫోటోలలో గోల్డ్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి..!

Updated On 15 Jan 2023 10:51 AM GMT
krs

krs

Next Story