విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ జీవో నంబర్ 5ను జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలకు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. మ్యానువల్‌గా పదోన్నతులు ప్రక్రియ, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరగనున్నాయి. హెడ్‌మాస్టర్ల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్(ఎస్ఏ) సీనియార్టీ జాబితాలను శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు. ఈ నెల 28 నుంచి 30వ […]

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ జీవో నంబర్ 5ను జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలకు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.
మ్యానువల్‌గా పదోన్నతులు ప్రక్రియ, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరగనున్నాయి. హెడ్‌మాస్టర్ల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్(ఎస్ఏ) సీనియార్టీ జాబితాలను శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు.
ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బదిలీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించ నున్నారు. దరఖాస్తులకు సంబంధించిన హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాలి.
ఈ నెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
