విధాత: మునుగోడులో ప్రధాన పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలో టీఆర్‌ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కొయ్యల గూడెం గ్రామం నుంచి చౌటుప్పల్ వరకు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన రోడ్ షోలో మంత్రికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మీ ఊపు, జోష్ చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్‌ వస్తదో, రాదో అనుమానం కొడుతున్నదని, నవంబర్ 6న మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి […]

విధాత: మునుగోడులో ప్రధాన పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలో టీఆర్‌ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కొయ్యల గూడెం గ్రామం నుంచి చౌటుప్పల్ వరకు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన రోడ్ షోలో మంత్రికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మీ ఊపు, జోష్ చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్‌ వస్తదో, రాదో అనుమానం కొడుతున్నదని, నవంబర్ 6న మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమైందని తెలుస్తోందన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. 2018లో చిన్న పొరపాటుతో మీరు రాజగోపాల్ రెడ్డిని గెలిపించారన్నారు.

అప్పుడు కాంగ్రెస్ తరపున గెలిచి బీజేపీ పాట పాడారని, బీజేపీతో కోవర్ట్ రాజకీయాలు చేసి, బేరసారాలు ఆడారన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత గుజరాతీ బాస్‌ల వద్ద మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడని, మునుగోడు నియోజకవర్గ సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కేవలం అహంకారంతోనే.. అంగడి సరుకు మాదిరిగా ఓటర్లను కొనేస్తా అని బలవంతంగా ఎన్నిక రుద్దారని, ఇది మునుగోడు ప్రజలు కోరుకునే ఎన్నిక కాదని అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పల్లెల్లో, పట్టణాలకు వెళ్తే తెలుస్తుందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకముందు.. ఎవరైనా చనిపోయి అంత్యక్రియలకు పోతే.. అర్దగంట కరెంట్ ఇవ్వమని అడుక్కున్నామన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం గోస పడ్డాం.. అన్నింటిని ఎదుర్కొని పంట పండిస్తే కనీసం మద్దతు ధర లభించక పోయేదని, కొనుగోలు కేంద్రాలు లేవు.. కానీ ఇప్పుడు అన్ని వసతులు మన ముందుకు వచ్చాయని పేర్కొన్నారు.

తెలంగాణ రైతులు ఇవాళ సంతోషంగా ఉన్నారని, ఒకనాడు నల్లగొండ అంటే నీళ్లు లేని ప్రాంతం. ఈ రోజు మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించే జిల్లా నల్లగొండ అని చెప్పొచ్చన్నారు. ఇది కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని, మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని, పిల్లను ఇచ్చేందుకు కూడా ఆలోచించే పరిస్థితి ఉండేదన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక.. ఇంటి ముందే నల్లా పెట్టి, సురక్షిత తాగునీరు అందిస్తున్నామని, మిషన్ భగీరథ పైలాన్‌కు చౌటుప్పల్‌లో పైలాన్ వేసి, ఫ్లోరోసిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. నాలుగేండ్లలోనే మంచినీళ్లు ఇచ్చామని, కరెంట్.. తాగునీరే కాదు.. సాగు నీటి రంగంలో కూడా అద్భుతమైన పురోగతి సాధించామన్నారు. ఈ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయన్నారు.

Updated On 21 Oct 2022 5:09 PM GMT
krs

krs

Next Story