విధాత: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఎస్.ఐ., కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీభవన్ రెండు గేట్లకు తాళాలు వేశారు.
SI, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత pic.twitter.com/lt7pwwhqmQ
— vidhaathanews (@vidhaathanews) January 25, 2023
ఆందోళన విరమించి వెళ్లాలని, జీవితాలు నాశనం చేసుకోవద్దని అభ్యర్థులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదని అభ్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి నేతృత్వంలో పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.