Wednesday, March 29, 2023
More
    HomelatestTSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై నిరసనలు అరెస్టులు ఉద్రిక్తతలతో అట్టుడికిన రాజధాని

    TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై నిరసనలు అరెస్టులు ఉద్రిక్తతలతో అట్టుడికిన రాజధాని

    విధాత: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ బీజేపీ, బీఎస్పీ, వైఎస్ఆర్ టీపీ పార్టీలు చేపట్టిన దీక్షలు, ఆందోళనతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అట్టుడికింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపి 30 లక్షలు మంది నిరుద్యోగుల జీవితాలను కాపాడేందుకు పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని, టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

    ఆర్‌ఎస్‌పీ ఆమరణదీక్ష

    గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో లక్డికపూ్‌ల్‌లోని బీఎస్పీ కార్యారాలయంలో ఆమరణదీక్ష చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి ఆయన నివాసానికి తరలించారు. ఆయన ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని, సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను తొలిగించి లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    అరెస్టు అనంతరం ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్న ఆర్‌ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుతంగా మా పార్టీ ఆఫీసులో చేస్తున్న దీక్షను కేసీఆర్‌ భగ్నం చేశారు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాహారదీక్ష ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్‌ 1తో పాటు మిగతా పేపర్లన్నీ లీకయ్యాయి. పరీక్షలన్నీ రద్దు చేసేంత వరకు మీరు ఏం చేసినా నిరాహారదీక్ష ఆపేది లేదన్నారు. టీఎస్‌పీఎస్పీ ఛైర్మన్‌ వెంటనే పదవి నుంచి వైదొలగాలి. సర్వీస్‌ కమిషన్‌పై నిరుద్యోగులందరికీ విశ్వాసం పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఛైర్మన్‌ను తొలిగించి, ఆ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, మళ్లీ కొత్తగా పరీక్షలన్నీ పెట్టేవరకు మా నిరాహారదీక్ష కొనసాగుతుందన్నారు.

    శాంతియుతంగా జరుగుతున్న దీక్షను భగ్నం చేశారు. దీన్ని తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నది. కేసీఆర్‌ కుటుంబంతో ఈ లీకులతో సంబంధం ఉన్నదని ఆయన ఆరోపించారు. ఇది ఒక్కరోజు కాదు గత మూడేళ్లుగా జరుగుతున్నవ్యవహారం అన్నారు. దీనిపై తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని స్థానిక పోలీసులు దీన్ని దర్యాప్తు చేయలేరని కాబట్టి ఈ కేసు సీబీఐ అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పతిని తాము విజ్ఞప్తి చేయబోతున్నాం. సీఎంవో కార్యాలయానికి, సర్వీస్‌ కార్యాలయానికి ఈ లీకేజీ వ్యవహారంలో కచ్చితంగా సంబంధం ఉన్నదనే సమాచారం తమవద్ద ఉన్నది.అది తాను సీబీఐకే ఇస్తానని ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ తెలిపారు.

    బండి సంజయ్‌, ఈటల అరెస్ట్‌

    గన్‌పార్క్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనాన్ని ఆపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ సంజయ్‌ పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే ఆయన అనూహ్యంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అక్కడే దీక్ష చేపట్టారు.

    దీక్ష సమయంలో పోలీసులు సంయమనంతోనే ఉన్నారు. అయితే దీక్ష విరమణ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టిస్తామని ప్రకటించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయానికి ఆయన పిలుపునిచ్చారుఅప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశరాఉ. సంజయ్‌ ని అదులోకి తీసుకునే క్రమంలో బీజేపీ శ్రేణులు ఆయన చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడి పోలీసులను అడ్డుకున్నారు.

    దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు సంజయ్‌, ఈటల, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తో పాటు ముఖ్యనేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తలు, మహిళా మోర్చ నేతలు పోలీసులను నిలువరించే ప్రయత్నం చేయడంతో వారికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు వీరందరినీ చెదరగొట్టారు. ఈటల రాజేందర్‌ను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. సంజయ్‌ని బొల్లారం స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం

    టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనక ముఖ్యమంత్రి కుటుంబం హస్తం ఉందని, లీకేజీకి మంత్రి కేటీఆర్ (Minister KTR) బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

    మరోవైపు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ను కూడా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తీరుపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడుతూ నిరుద్యోగుల జీవితాలను నష్టపరిచిన టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని, పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ ను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

    యూనివర్సిటీ రెండువైపులా పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విద్యార్థులను కట్టడి చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలను నియంత్రించేందుకు పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు చేపట్టారు. వామపక్ష విద్యార్థి సంఘాలు,
    ఎన్ఎస్‌యుఐ, ఏబీవీపీ విద్యార్థి వేరువేరుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

    TSPSC | తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దు

    ABVP కలెక్టరేట్ ముట్టడి..అరెస్ట్

    ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ పై చర్యలు తీసుకోని, పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. పోలీసులు ఏబీవీపీ నాయకులను తెల్లవారుజామునుండే అరెస్టు చేసినప్పటికీ, స్థానికంగా ఉన్న వివిధ కళాశాలల ఏబీవీపీ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు.

    కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఏబీవీపీ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట సాగింది. విద్యార్థులు ఈ సందర్భంగా పోలీసులకు, ప్రభుత్వానికి, టిఎస్పిఎస్సి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular