- పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- ఆర్థిక, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశ, రాష్ట్రాల్లో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఢిల్లీలో పీఆర్ఎస్ శాసన పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో జరిగిన చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన ఈ వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు.
వర్క్ షాప్ అనుభవాలను ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. దేశం, రాష్ట్రాల ఆర్థిక, ఆరోగ్య వ్యవహారాలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసన సభ్యుల కోసం పిఆర్ఎస్ అనే పరిశోధన సంస్థ, ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సెమినార్ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన తెలిపారు.
ఏడు విడతలలో జరిగిన సెమినార్లో భాగంగా మొదటి రోజు సమావేశంలో బడ్జెట్ పై అవగాహన, భారత ఆర్థిక స్థితి, భారతీయ రాష్ట్రాల్లో ఆరోగ్యంపై వెచ్చిస్తున్న నిధులు, ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆరోగ్య పథకాలు, రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్న బడ్జెట్, దేశంలోని రాష్ట్రాల్లో ఆర్ధిక ధోరణులు, కేంద్ర ప్రాయోజిత పథకాల పైన చర్చ జరిగింది.
భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల పనితీరు వాటి ఆర్ధిక పరిస్థితులపై కూలంకషంగా జరిగిన సెమినార్ లో దేశంలో ప్రముఖ సంస్థల నుండి స్పీకర్స్ పాల్గొని ఆయా అంశాలపై సుధీర్ఘమైన చర్చను శాసన సభ్యుల ముందు పెట్టారు.
బడ్జెట్ అవలోకనం, ఆర్ధిక వనరులు సద్వినియోగం, ఆర్ధిక రంగంపై వెచ్చించాల్సిన నిధులు, స్థానిక సంస్థల పనితీరు వాటికి కేటాయించాల్సిన ఆర్థిక నిధులు తదితర అంశాలను వక్తలు అద్భుతంగా వివరించారని చీఫ్ విప్ పేర్కొన్నారు.
దేశ శాసన వ్యవస్థ పురోగతిపై పరిశోధనలు జరుపుతున్న పిఆర్ఎస్ సంస్థ చాలా అర్ధవంతమైన విధానాలతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మరిన్ని సమకాలీన అంశాలపై చర్చలు నిర్వహించాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.