సమంతే అనుకుంటుంటే.. ఇప్పుడు మరో నటికి అనారోగ్యం విధాత: సినిమా రంగం అంటే ఆషామాషీ కాదు. మండే ఎండల్లో, గడ్డ కట్టించే చలిలో కూడా వెలుగు జిలుగుల మధ్య లైట్లు, కెమెరాలు ఇలాంటి వాటితో.. సరైన సమయానికి చేయాల్సిన పనులు చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమందికి షూటింగ్ స్పాట్‌లో చేసే భోజనాలు, తినే తిండ్లు, తాగే నీరు వంటివి కూడా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సమంతా మయోసైటీస్ అనే ప్రాణాంతక […]

సమంతే అనుకుంటుంటే.. ఇప్పుడు మరో నటికి అనారోగ్యం

విధాత: సినిమా రంగం అంటే ఆషామాషీ కాదు. మండే ఎండల్లో, గడ్డ కట్టించే చలిలో కూడా వెలుగు జిలుగుల మధ్య లైట్లు, కెమెరాలు ఇలాంటి వాటితో.. సరైన సమయానికి చేయాల్సిన పనులు చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమందికి షూటింగ్ స్పాట్‌లో చేసే భోజనాలు, తినే తిండ్లు, తాగే నీరు వంటివి కూడా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి.

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సమంతా మయోసైటీస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంది. ఇంతలోనే పునర్నవి భూపాలం అనే తెలుగు నటి కూడా అనారోగ్యం బారిన పడింది. ఈమె తెలుగు చిత్రాలతో పాటు టెలివిజన్‌పై కూడా కనిపించింది. అలా తెలుగు వారికి ఈమె సుప‌రిచితురాలు.

2013లో వచ్చిన ఉయ్యాలా జంపాలా అనే చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది. తెనాలికి చెందిన ఈమె మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం, సైకిల్ వంటి చిత్రాలలో నటించింది.

ఉయ్యాలా జంపాలా చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఫిలింఫేర్ అవార్డును సాధించింది. ఇక తెలుగులో బిగ్ బాస్3లో ఈమె పార్టిసిపేట్ చేసింది. ఆలీతో సరదాగా షోతో పాటు 2020 అనుకున్నది ఒక్కటి అయిందొకటి.. వంటి టెలి‌ఫిలిమ్స్‌లో నటించింది. ఆహా ఓటీటీ నిర్మించిన కమిట్మెంటల్ అనే వెబ్ సిరీస్‌లోను ఈమె యాక్ట్ చేసింది.

తాజాగా పున‌ర్న‌వి భూపాలం మాట్లాడుతూ.. త‌ను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నట్టు తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా తెలియజేసింది. ఊపిరితిత్తుల సమస్యతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నా. నేను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నా అని పేర్కొంది.

ఈ పోస్ట్ చూసినా ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.. ఇక బిగ్ బాస్ సీజన్ 3‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈమె 77 రోజులపాటు హౌస్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె సినీ కెరీర్‌ని పక్కన పెట్టి ఉన్నత చదువుల కోసం విదేశాల్లో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. అడపాదడపా ఇక్కడికి వచ్చి వెళ్తుంది.

Updated On 5 Jan 2023 6:46 AM GMT
krs

krs

Next Story