Viral Video | దొంగలకు పిల్లలు భయపడి పారిపోతుంటారు. కానీ ఓ బాలిక(Girl ) మాత్రం దొంగకు చుక్కలు చూపింది. తన నానమ్మ( Grand Mother ) మెడలో నుంచి బంగారు గొలుసు( Gold Chain )ను అపహరించేందుకు యత్నించిన దొంగ ముఖంపై దాడి చేసి, పారిపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర( Maharashtra )లోని పుణె సిటీ( Pune City )లోని మోడల్ కాలనీ ఏరియాలో నిర్మానుష్యంగా ఉన్న రహదారిపై ఓ 60 ఏండ్ల వృద్ధురాలు తన ఇద్దరు మనవరాండ్లతో నడుచుకుంటూ వెళ్తుంది. వారికి ఎదురుగా యాక్టివాపై వచ్చిన ఓ వ్యక్తి.. ఆ వృద్ధురాలిని దారి గురించి అడిగినట్లు నటిస్తూ, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించేందుకు యత్నించాడు. పక్కనే ఉన్న మనవరాలు రుత్వి గాగ్(10) అప్రమత్తమైంది తన చేతిలో ఉన్న సంచితో చైన్ స్నాచర్( Chain Snatcher ) ముఖంపై పలుమార్లు కొట్టింది. దీంతో అతను బంగారు గొలుసును అక్కడే విసిరేసి పారిపోయాడు.
ఈ ఘటన ఫిబ్రవరి 25వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ధైర్యసాహసాలు ప్రదర్శించి చైన్ స్నాచర్ పారిపోయేలా చేసిన ఆ బాలికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
#WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother’s chain in Maharashtra’s Pune City
The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/LnTur7pTeU
— ANI (@ANI) March 10, 2023