విధాత: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసుల నమోదు, నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలనే పోలీసుల వాదనను అవినీతి నిరోధక శాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. అ.ని. శా. కోర్టు జడ్జి నిర్ణయాన్ని సైబరా బాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ రేపటికి వాయిదా వేసింది. https://t.co/eG39SLKuPJ — vidhaathanews (@vidhaathanews) October 28, 2022 ఈ వ్యవహారం బైట పడినప్పటి నుంచి టీఆరెఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల […]

విధాత: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసుల నమోదు, నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలనే పోలీసుల వాదనను అవినీతి నిరోధక శాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. అ.ని. శా. కోర్టు జడ్జి నిర్ణయాన్ని సైబరా బాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఈ వ్యవహారం బైట పడినప్పటి నుంచి టీఆరెఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా బయటపడ్డ బీజేపీ బేరసారాల బాగోతం అంటూ.. టీఆర్‌ఎస్ ఆడియో క్లిప్‌లను విడుదల చేసింది.

ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని ముందు ముందు మరింత బయటకి రానున్న బీజేపీ నీచ రాజకీయాల బాగోతమని టీఆరెఎస్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఆ ఆడియో క్లిప్ కు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంభాషణ ఇదే

TRS MLA పైలట్‌రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి ఆడియో సంభాషణ:

రామచంద్రభారతి: హలో.. హలో..
రోహిత్‌రెడ్డి: స్వామీజీ మాట్లాడండి
రోహిత్‌రెడ్డి: నమస్కారం స్వామీజీ.. ఎలా ఉన్నారు
రామచంద్రభారతి: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు
రోహిత్‌రెడ్డి: జీ, నంద జీకి మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి
రామచంద్రభారతి: మాకు ఇంకొంచెం వివరాలు కావాలి, అక్కడ మాట్లాడుతాను
రోహిత్‌రెడ్డి: నేను ఇప్పటికే వారితో మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు
రామచంద్రభారతి: నాకు ఒక సారి పేర్లు ఖరారు చేస్తే సులభమైపోతుంది
రోహిత్‌రెడ్డి: స్వామిజీ ఇప్పుడే పేర్లు చెప్పడం కష్టం, ఇప్పటికైతే నాకు ఇద్దరు కన్‌ఫర్మ్ చేశారు
రోహిత్‌రెడ్డి: కానీ ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది

రామచంద్రభారతి: కచ్చితంగా కలుద్దాం, 24 తారీకు వరకు నేను బెడ్‌రెస్ట్‌లో ఉన్నాను, 24 వరకు రాలేను
రామచంద్రభారతి: 24 తారీకు తర్వాత నన్ను ఒకసారి రమ్మంటావా, హైదరాబాదైనా లేదా మరెక్కడైనా కలుద్దాం
రామచంద్రభారతి: హైదరాబాద్‌ వద్దు ఇంకెక్కడైనా కలుద్దామా
రోహిత్‌రెడ్డి: అలా కాదు స్వామిజీ.. సమస్యేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి, మీకు తెలుసుకదా
రోహిత్‌రెడ్డి: మా మీద కూడా దృష్టి ఉంటుంది, వేరే ప్లేస్‌ వద్దు, హైదరాబాద్‌లో అయితేనే బాగుంటుంది
రోహిత్‌రెడ్డి: ఎందుకంటే మేమంతా హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి, హైదరాబాద్‌ బెస్ట్ ప్లేస్‌ మనకు
రోహిత్‌రెడ్డి: మీరు కలవాలనుకున్న రోజు బి.ఎల్‌.సంతోష్‌ జీ కూడా చార్టర్‌లో వస్తానని నందూ చెప్పాడు
రోహిత్‌రెడ్డి: ఒక అరగంట సేపు మనం చర్చించుకోవచ్చు, ముగించుకోవచ్చు

రామచంద్రభారతి: రేపు ఉదయం నేను బి.ఎల్‌.సంతోష్‌తో మాట్లాడుతా
రామచంద్రారెడ్డి: బల్క్‌ రెడీగా ఉంటే బి.ఎల్‌.సంతోష్‌ కూడా వస్తారు
రోహిత్‌రెడ్డి: చూడండి స్వామిజీ, నాతో కలిపి ముగ్గురు రెడీగా ఉన్నారు
రామచంద్రభారతి: మనం ఏం చేద్దామంటే, 24 తర్వాత ఒకసారి నేను హైదరాబాద్‌ వస్తాను
రామచంద్రభారతి: మనం కూర్చొని మాట్లాడుకుందాం, అదే రోజు మనం నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం

రోహిత్‌రెడ్డి: ఓకే స్వామిజీ, మనం అలాగే చేద్దాం కానీ..
రామచంద్రభారతి: మీరు నందూజీతో ఏదైతే మాట్లాడారో అందులో ఎలాంటి సమస్యా లేదు
రామచంద్రభారతి: మిగిలిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు
రోహిత్‌రెడ్డి: నందుజీ నాకు ఈ ప్రపోజల్‌ ఇచ్చారు, నేను ఓకే అనుకున్నా
రోహిత్‌రెడ్డి: నాకు అన్ని విధాలా హామీ ఇచ్చారు, నా రక్షణ, నా భవిష్యత్‌పై నందూ నాకు హామీ ఇచ్చారు

రామచంద్రభారతి: కచ్చితంగా ఇదే విషయం మరోసారి మీ ముందే మాట్లాడుకుందాం
రామచంద్రభారతి: ఇందులో సందేహం లేదు, ముందు వచ్చినవారే ముందు వరుసలో ఉంటారు
రామచంద్రభారతి: మీరు వ్యవస్థను బాగా చదివారు, అసలు విషయం ఏంటో కచ్చితంగా తెలుసు
రామచంద్రభారతి: అందుకే మిమ్మల్ని ప్రమోట్ చేయడం మాకు చాల సులభం
రోహిత్‌రెడ్డి: నేను కూడా ఆసక్తిగానే ఉన్నా, ఇప్పటికే నా గురించి మీ అందరికీ తెలుసు
రామచంద్రభారతి: తప్పకుండా మీకు మేం సపోర్ట్‌గా ఉంటాం
రామచంద్రభారతి: అవన్ని మనం ఫోన్‌లో మాట్లాడుకోవడం మంచిది కాదు
రామచంద్రభారతి: ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదు, మిగిలిందంతా మేం చూసుకుంటాం
రామచంద్రభారతి: మీరు ఎలాంటి ప్రపోజల్‌ ఇచ్చినా దాని ప్రకారమే ముందుకెళ్తాం

రోహిత్‌రెడ్డి: నాకేమీ తొందర లేదు, నందూయే రేపు, రేపు అంటూ తొందర పెడుతున్నారు
రామచంద్రభారతి: మునుగోడు ఎన్నికల తేదీ 3కు ముందే చేరితే మరోలా ఉంటుంది
రామచంద్రభారతి: మా ఆర్గనైజేషన్‌లో స్ట్రాంగ్‌ లీడర్‌ కావాలని అనుకున్నాం
రామచంద్రభారతి: అందుకే నేను నందుపై ఒత్తిడి తెస్తున్నా
రామచంద్రభారతి: 4, 5 రోజులుగా నందు నిద్రకూడా పోవడం లేదు
రామచంద్రభారతి: మరో ఇద్దరు, ముగ్గురిని పేర్లు కూడా నందూ తీసుకొచ్చాడు, కానీ వద్దనుకున్నాం
రామచంద్రభారతి: ఈనెల 26న కూర్చుంటే బాగుంటుంది
రామచంద్రభారతి: ఈనెల 25న అయినా పర్వాలేదు
నందూ: ఈనెల 25న గ్రహణం ఉంది, ఆ తర్వాత మనం ఎప్పుడు కూర్చున్నా బాగుంటుంది
నందూ: స్వామిజీ మీరు మరోసారి క్లారిటీ తీసుకోగలరు
నందూ: మేం కూడా ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం
నందూ: ఎలాగూ దీపావళి కూడా ఉంది, అప్పటివరకు మేం మరింత మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం
రామచంద్రభారతి: నేను ఇప్పటికే ఇద్దరికీ ఆ విషయాన్ని చెప్పాను
నందు: ఇద్దరికీ చెప్పారా స్వామీజీ, వాళ్లు ఈరోజు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు కదా స్వామీజీ..
రామచంద్రభారతి: అవును, వాళ్లు ఈరోజే అనుకుంటున్నారు, అందుకోసమే ఢిల్లీలో ఉన్నారు
రామచంద్రభారతి: ఈరోజు సాయంత్రం 4 గంటలకు చార్టర్‌లో అహ్మదాబాద్‌ వెళ్తున్నారు
నందూ: నెం.2తో నా, నెం.1తోనా
రామచంద్రభారతి: నెం.1తో వెళ్లారు, క్షమించాలి కాదు, కాదు నెం.-2తో వెళ్లారు
రోహిత్‌రెడ్డి: స్వామీజీ మరో విన్నపం ఏంటంటే, ఎక్కువ మందిని ప్రయత్నం చేయొద్దు
రోహిత్‌రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా, చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి
రోహిత్‌రెడ్డి: మా సీఎంకు తెలిస్తే మా పని పడతారు, మేం ముగ్గురం అయితే సిద్ధంగా ఉన్నాం
రామచంద్రభారతి: ఆ ముగ్గురి పేర్లు నేను తెలుసుకుంటే ముందుకెళ్లడానికి మరింత సులభం

రామచంద్రభారతి: అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఉంది, మనం ఈనెల 26న కూర్చొని మాట్లాడుకుందాం
రామచంద్రభారతి: నెం.2 ఎదుట ఎవరెవరు ఓకే అన్నారో పేర్లు చెబుతారా
రోహిత్‌రెడ్డి: నెం.2 ఎదుట పేర్లు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు
రోహిత్‌రెడ్డి: ప్లీజ్‌ ప్లీజ్‌ ఈ విషయం బయటకు పొక్కొద్దు
రామచంద్రభారతి: మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
రామచంద్రభారతి: మీ భద్రత, మీ భవిష్యత్‌ అంతా కేంద్రం చూసుకుంటుంది
రామచంద్రభారతి: మా సంస్థలో బి.ఎల్‌.సంతోష్ చాలా కీలకం
రామచంద్రభారతి: నెం.1, 2లే బి.ఎల్‌.సంతోష్‌ ఇంటికి వస్తుంటారు
రామచంద్రభారతి: నెం.1, నెం.2ల ఇంటికి బి.ఎల్‌. సంతోష్‌ వెళ్లరు, అది RSS ప్రొటోకాల్
రామచంద్రభారతి: ఇలాంటి విషయాలను హ్యాండిల్‌ చేయడంలో బెంగాల్‌ ఎపిసోడ్‌ మాకు మంచి అనుభవం
నందూ: స్వామీజీ మరొక్క విషయం, రోహిత్‌ సార్‌కు శరత్‌ చాలా దగ్గరి వ్యక్తి
రామచంద్రభారతి: అరబిందో ఫార్మా శరతేనా..అది చాలా సంక్లిష్టమైన కేసు, మనం వారితో కూర్చొని డీల్‌ చేయాలి
నందూ: స్వామీజీ, మీరు వచ్చినప్పుడు వాళ్లతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తాం
రోహిత్‌రెడ్డి: నందన్న వద్దు.. నందన్నా ఈ ఫాల్స్‌ ప్రామిసెస్ వద్దు, స్వామీజీ ఇందులో నేను ఇన్వాల్వ్‌ కాను
రోహిత్‌రెడ్డి: అతను నాకు మంచి మిత్రుడే కానీ, ప్రస్తుతానికి ఆ విషయంలో ఇన్వాల్వ్‌ కాలేను స్వామీజీ
రామచంద్రభారతి: సరే, పర్వాలేదు, మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిద్దాం
రోహిత్‌రెడ్డి: ‌-థాంక్యూ స్వామీజీ
రామచంద్రభారతి: థ్యాంక్యూ…

Updated On 28 Oct 2022 9:35 AM GMT
krs

krs

Next Story