KS RAMARAO | AP విధాత: చంద్రబాబు అరెస్ట్ మీద సినిమా ఇండస్ట్రీలో పెద్దగా స్పందన లేదు.. హీరోలు.. బడా నిర్మాతలు అరెస్టును ఖండిస్తారని, జగన్ను దునుమాడతారని చాలామంది ఆశించారు.నిత్యం చంద్రబాబు వెంట ఉండే నిర్మాత, రాజమండ్రి మాజీ ఎంపి మురళీ మోహన్ సైతం కిక్కురుమనలేదు. బాబును బహిరంగంగా ముద్దు పెట్టిన రాజేంద్రప్రసాద్ సైతం సౌండ్ లేదు. కానీ రాఘవేంద్రరావు, అశ్వనీదత్ మాత్రం స్పందించి మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టారు. ఇక వీరంతా ఒకెత్తు కాగా క్రియేటివ్ కమర్షియల్స్ […]

KS RAMARAO | AP
విధాత: చంద్రబాబు అరెస్ట్ మీద సినిమా ఇండస్ట్రీలో పెద్దగా స్పందన లేదు.. హీరోలు.. బడా నిర్మాతలు అరెస్టును ఖండిస్తారని, జగన్ను దునుమాడతారని చాలామంది ఆశించారు.నిత్యం చంద్రబాబు వెంట ఉండే నిర్మాత, రాజమండ్రి మాజీ ఎంపి మురళీ మోహన్ సైతం కిక్కురుమనలేదు.
బాబును బహిరంగంగా ముద్దు పెట్టిన రాజేంద్రప్రసాద్ సైతం సౌండ్ లేదు. కానీ రాఘవేంద్రరావు, అశ్వనీదత్ మాత్రం స్పందించి మాట్లాడుతూ శాపనార్థాలు పెట్టారు. ఇక వీరంతా ఒకెత్తు కాగా క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కే ఎస్ రామారావు మాత్రం ఒకడుగు ముందుకు వేసి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరారు.
ఆయన ఏకంగా ప్రధానిని మీకు తెలియకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారా ? అని ప్రశ్నించారు… "మీరు జీ-20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్ లో ఉన్నప్పుడు ఈ అరెస్టు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాంలు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరఫున బాధతో అడుగుతున్నా. చంద్ర బాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది" అని పేర్కొన్నారు.
అనంతరం. "నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు కానీ… రాష్ట్ర పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయాను. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారు. శంకుస్థాపనకు మీరూ వచ్చారు.
తర్వాత.. 16 నెలలు జైల్లో గడిపి, ఆర్థిక నేరాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన మొదలుపెట్టారు" అని రామారావు. "మీరు శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో అలా చేయొద్దని జగన్ ను హెచ్చరించాల్సింది. దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే.. ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారు." అంటూ రాసేశారు.
