కోడి పిల్లను ఎరగా పెట్టి.. కొండచిలువను పట్టేశారు (వీడియో)
Python | విధాత: కొండ చిలువ పేరు వింటేనే గుండెల్లో గుబులు పెడుతోంది. అది పక్షులు, జంతువుల నుంచి మొదలుకుంటే మనషుల వరకు అందర్నీ అమాంతం మింగేస్తోంది. అంతటి భయంకరమైన పైథాన్ కనిపించిందంటే చాలు.. ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లం. సాహసం కూడా చేయం. అయితే ఓ నీటి మడుగులో ఉన్న కొండ చిలువను పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అది చిక్కలేదు. దీంతో తెలివిగా.. నీటిమడుగు చుట్టూ కర్రలు నాటారు. ఒక చోట మాత్రం చిన్నపాటి […]

Python | విధాత: కొండ చిలువ పేరు వింటేనే గుండెల్లో గుబులు పెడుతోంది. అది పక్షులు, జంతువుల నుంచి మొదలుకుంటే మనషుల వరకు అందర్నీ అమాంతం మింగేస్తోంది. అంతటి భయంకరమైన పైథాన్ కనిపించిందంటే చాలు.. ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లం. సాహసం కూడా చేయం.
అయితే ఓ నీటి మడుగులో ఉన్న కొండ చిలువను పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అది చిక్కలేదు. దీంతో తెలివిగా.. నీటిమడుగు చుట్టూ కర్రలు నాటారు. ఒక చోట మాత్రం చిన్నపాటి డ్రమ్మును ఉంచి దాని ముందు భాగంలో ఓ కోడి పిల్లను ఉంచారు.
దాంతో ఆ కోడి పిల్లను మింగేందుకు కొండచిలువ యత్నించి ఆ క్రమంలో డ్రమ్ములో పైథాన్ చిక్కుకు పోయింది. కొండచిలువను బంధించేందుకు కోడిపిల్లను ఎరగా చూపిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో 2018 నాటిది అయినప్పటికీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను ఐదు మిలియన్ల మంది వీక్షించగా, 1,33,000 మంది లైక్ చేశారు.
