Thursday, March 23, 2023
More
    HomelatestRAGHAVULU: తెలంగాణలో 6నెలల ముందు ఎన్నికలు రావచ్చు: BV రాఘవులు

    RAGHAVULU: తెలంగాణలో 6నెలల ముందు ఎన్నికలు రావచ్చు: BV రాఘవులు

    స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం: మంత్రి జగదీష్ రెడ్డి

    విధాత, తెలంగాణలో ఆరు నెలలు ముందే ఎన్నికలు రావచ్చని CPM నేత BV రాఘవులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఆదివారం సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి సభలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు బీవీ రాఘవులు హాజరై నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా బీవీరాఘవులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాల హక్కులు హరించుకు పోతున్నాయన్నారు.
    గవర్నర్లతో కేంద్రం తోలు బొమ్మలాట ఆడిస్తుందన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి దేశాన్ని రక్షించుకోవాలన్నారు. దేశంలో విద్వేషపూరిత మతోన్మాదం రాజకీయాలు సాగిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గజదించేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సీపీఎం పోరాడుతుందన్నారు.

    కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను ఆదానికి దోచి పెడుతూ కార్పొరేట్ అనుకూల కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు.

    కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో సిపిఎం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో పేదలు రైతుల హక్కుల పరిరక్షణకు పునరంకితమై పోరాడుతుందన్నారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం కోరుతుందన్నారు.

    మంత్రి జి. జగదీష్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం ఆడ వాళ్లు అబలలు కాదు సభలలు అని నిరూపించిన యోధురాలన్నారు. నమ్మిన ఆశయం కోసం కొట్లాడిన వీరవనిత స్వరాజ్యం అని, ఆమె ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలన్నారు..

    తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను, అరాచకాలను ఎదిరించడంలో స్వరాజ్యం గారు చూపిన తెగువ ఎనలేనిదని కొనియాడారు. నేటి యువతరానికి ఆమె లాంటి యోధుల జీవితాలు స్పూర్తి అన్నారు.. కానీ నేటి తరం యువతను చూస్తే బాధ అనిపిస్తుందన్న మంత్రి అనవసరమైన టెక్నాలజీ మోజులో పడి రాజకీయాలకు దూరం అవడం మే కాకుండా, ప్రశ్నించే మనస్తత్వాన్ని కూడా కోల్పోతున్నారని , అది దేశానికి చాలా ప్రమాదకరమన్నారు.

    బిజెపి పాలనలో పేద వారు మరింత పేద వారుగా మారుతునన్నారని అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక అభివృద్ధి సూచీలో దేశం మరింత గా దిగజారిందని తెలిపారు. కేవలం ఆధానీ, అంబానీల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు.. బీజేపీనీ దేశం నుంచి పారద్రోలే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబోయే పోరాటంలో వెన్ను దన్నుగా నిలబడాలని కోరారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular