విధాత‌: రాహుల్ భారత్ జోడో యాత్ర 5వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. జడ్చర్ల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. రాహుల్ గాంధీ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిన్నారులతో కలిసి రాహుల్ ముచ్చటిస్తూ ముందుకు సాగారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. LIVE: With an overwhelming support from the people of Telangana, #BharatJodoYatra resumes from […]

విధాత‌: రాహుల్ భారత్ జోడో యాత్ర 5వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. జడ్చర్ల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. రాహుల్ గాంధీ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిన్నారులతో కలిసి రాహుల్ ముచ్చటిస్తూ ముందుకు సాగారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు.

ఈ సందర్భంగా పిల్లలతో పాటు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. పిల్లలతో కలిసి వేగంగా పరుగెత్తారు. పోటాపోటీగా రన్ చేసినా రేసులో రేవంత్ రెడ్డి వెనకబడ్డారు. వేగంగా పరుగెత్తి ముందు నిలిచారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ, రేవంత్ వెంట పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ షబ్బీర్ అలీ కూడా పరుగెత్తారు. అయితే వాళ్లిద్దరు రేవంత్, రాహుల్ తో పరుగెత్తలేకపోయారు.

గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రాజాపూర్, బాలానగర్ మీదుగా.. అన్నారం గేట్, షాద్ నగర్ వరకు కొనసాగనుంది భారత్ జోడో యాత్ర. బాలానగర్ జంక్షన్ దగ్గరున్న అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ బ్రేక్ తీసుకున్నారు. సాయంత్రం 4గంటలకు బాలానగర్ జంక్షన్ దగ్గర నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు షాద్ నగర్ బైపాస్ దగ్గరున్న అన్నారం గేట్ వద్ద రాహుల్ మాట్లాడనున్నారు. అనంత‌రం ఫరూక్ నగర్ లో నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారు. ఈరోజు రాహుల్ యాత్ర మొత్తం 22 కిలోమీటర్లు సాగనుంది.

మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇవాళ రంగారెడ్డి జిల్లాలోకి భారత్ జోడో యాత్ర ఎంటర్ కానుంది. దీంతో.. రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్.. మాణిక్కం ఠాగూర్, భట్టి విక్రమార్క మధుయాష్కి, ఎంపీ ఉత్తమ్ దంపతులు, వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.

Updated On 30 Oct 2022 7:28 AM GMT
Somu

Somu

Next Story