Rahul Gandhi |
విధాత: రాహుల్ గాంధీకి మూడేళ్ల పాటు సాధారణ పాస్‌పోర్టు ఇవ్వడానికి నిరభ్యంతర పత్రాన్ని ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. ఎంపీగా అనర్హతను ఎదుర్కొన్న రాహుల్ తన దౌత్య పాస్‌పార్టును అప్పగించిన విషయం విదితమే.
‘పాక్షికంగా మీ విన్నపాన్ని ఆమోదిస్తున్నాను. పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే అనుమతి ఇస్తున్నాను’ ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి రాహుల్ గాంధీ న్యాయవాదితో చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.