Saturday, April 1, 2023
More
    Homelatestరాహుల్‌ గాంధీ.. కొత్త లుక్‌ అదుర్స్‌

    రాహుల్‌ గాంధీ.. కొత్త లుక్‌ అదుర్స్‌

    • జుట్టు కత్తిరించి.. గడ్డం ట్రిమ్ చేసి..

    దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల మీదుగా నాలుగు నెలలపాటు 4వేల కిలోమీటర్లు సాగిన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా గడ్డం, జుట్టు పెంచిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ.. (Rahul Gandhi) ఇప్పడు కొత్త లుక్‌లో అదరగొడుతున్నాడు. లండన్‌లో ఒకప్పడు తాను చదివిన యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ (University of Cambridge)లో రాహుల్‌ ఉపన్యసించాల్సి ఉన్నది.ఇందుకోసం ఆయన మంగళవారం లండన్‌ చేరుకున్నారు.

    విధాత: భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) తర్వాత మొదటిసారిగా రాహుల్‌గాంధీ జుట్టు కత్తిరించుకుని, గడ్డం ట్రిమ్‌ చేసుకుని స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మొత్తంగా వారం రోజులపాటు ఆయన లండన్‌ పర్యటన కొనసాగనున్నది.

    కేంబ్రిడ్జ్‌ జడ్జ్‌ బిజినెస్‌ స్కూల్‌ Cambridge Judge Business School (Cambridge JBS)లో ఆయన విజిటింగ్‌ ఫెలో గా ఉన్నారు. 21వ శతాబ్దాన్ని వినటాన్న నేర్చకోవటం (Learning to Listen in the 21st Century) అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.

    ఈ కార్యక్రమం కోసం ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

    యూనివర్సిటీకి చెందిన కార్పస్‌ క్రిస్టీ కాలేజీలో ట్యూటర్‌, డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్‌ శృతి కపిలతో కలిసి ‘బిగ్‌ డాటా, ప్రజాస్వామ్యం’ (Big Data and Democracy), ‘భారత్‌ – చైనా సంబంధాలు’ (India-China relations) అనే అంశాలపై నిర్వహించే సెషల్‌లో చర్చించనున్నారు.

    జుట్టు కత్తిరించి.. గడ్డం ట్రిమ్ చేసి..
    దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల మీదుగా నాలుగు నెలలపాటు 4వేల కిలోమీటర్లు సాగిన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా గడ్డం, జుట్టు పెంచిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ.. (Rahul Gandhi) ఇప్పడు కొత్త లుక్‌లో అదరగొడుతున్నాడు. లండన్‌లో ఒకప్పడు తాను చదివిన యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ (University of Cambridge)లో రాహుల్‌ ఉపన్యసించాల్సి ఉన్నది.ఇందుకోసం ఆయన మంగళవారం లండన్‌ చేరుకున్నారు.
    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular