HomelatestRahul Gandhi | అర్ధరాత్రి.. సెక్యూరిటీ లేకుండా లారీలో రాహుల్‌గాంధీ ప్ర‌యాణం

Rahul Gandhi | అర్ధరాత్రి.. సెక్యూరిటీ లేకుండా లారీలో రాహుల్‌గాంధీ ప్ర‌యాణం

  • లారీ డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌లు తెలుసుకొనేందుకు సాహ‌సం
  • అంబాలా నుంచి చండీగ‌ఢ్ వ‌ర‌కు లారీ ప్ర‌యాణం
  • సోష‌ల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు

విధాత‌: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మ‌రో సాహస యాత్ర చేశారు. లారీ డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌లు తెలుసుకొనేందుకు ఏకంగా లారీలోనే గంట‌పాటు ప్ర‌యాణం సాగించారు. సోమ‌వారం రాత్రి అంబాలా నుంచి చండీగ‌ఢ్ వ‌ర‌కు లారీ ప్ర‌యాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ నాయ‌కులు షేర్ చేశారు. రాహుల్ సాహ‌య యాత్ర వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

లారీలో 50 కిలోమీట‌ర్లు రాహుల్ ప్ర‌యాణం

సోమ‌వారం రాత్రి ఢిల్లీ నుంచి చండీగ‌ఢ్ కు బ‌య‌లు దేరిన రాహుల్‌గాంధీ.. మార్గ‌మ‌ధ్యంలో అంబాలా వ‌ద్ద లారీ ఎక్కారు. అంబాలా నుంచి చండీగ‌ఢ్ వ‌ర‌కు సుమారు 50 కిలోమీట‌ర్లు గంట‌ పాటు లారీలో ప్ర‌యాణం సాగించారు.

దేశ‌వ్యాప్తంగా భారీ వాహ‌నాల డ్రైవ‌ర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను కాంగ్రెస్ శ్రేణులు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాయి. లారీ డ్రైవ‌ర్లు, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొనేందుకు రాహుల్ గాంధీ లారీ ప్రయాణం చేసిన‌ట్టు పేర్కొన్నాయి.

అధికారిక కార్య‌క్ర‌మాలు లేవు..

చండీగ‌ఢ్‌లో రాహుల్‌గాంధీకి అధికారిక కార్య‌క్ర‌మాలు ఏమీ లేవు. కానీ, సిమ్లాలో ప్రియాంకా గాంధీ కుటుంబం ఉండ‌టంతో అక్క‌డి వెళ్లేందుకు మార్గ‌ మ‌ధ్యంలో లారీ ప్ర‌యాణం చేసిన‌ట్టు స‌మాచారం. అయితే, రాహుల్ లారీ ప్ర‌యాణానికి సంబంధించిన వీడియోల‌ను కాంగ్రెస్ నేత‌లు సోష‌ల్ మీడియాలో షేర్‌లో చేస్తూ వివిధ వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular