గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి విధాత, వరంగల్: గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా వరంగల్ కాశిబుగ్గలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద గురువారం సీపీఐ శ్రేణులు ధర్నా చేశారు. ధర్నాలో ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోని రాజ్ భవన్‌లు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలుగా మారాయని, రాజ్యాంగబద్ధంగా […]

గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి

విధాత, వరంగల్: గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా వరంగల్ కాశిబుగ్గలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద గురువారం సీపీఐ శ్రేణులు ధర్నా చేశారు.

ధర్నాలో ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోని రాజ్ భవన్‌లు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలుగా మారాయని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు బీజేపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి అనేక కుట్రలు చేశారని విమ‌ర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ స్ఫూర్తిని గవర్నర్లు కాలరాస్తూ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

దేశంలోని గవర్నర్ల వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, మండల కార్యదర్శి బుస రవీందర్, జిల్లా నాయకులు జన్ను రవి, పరికరాల రమేష్, తాళ్లపల్లి రాహేలా, బూజుగుండ్ల రమేష్, ఎల్ దాసు నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు లేదెళ్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 29 Dec 2022 12:18 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story