కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకున్న రాజగోపాల్ రెడ్డి.. వీడియో
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఆయా పార్టీల నాయకులు తమ స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలను లెక్క చేయడం లేదు. సమస్యలపై నిలదీసిన వారిపై కత్తులు నూరుతున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. దీంతో నియోజకవర్గం పరిధిలోని వెల్మకన్నే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నా కొడుకుల్లారా.. మా కార్యకర్తలు వస్తే […]

Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఆయా పార్టీల నాయకులు తమ స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలను లెక్క చేయడం లేదు. సమస్యలపై నిలదీసిన వారిపై కత్తులు నూరుతున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.
ఇక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. దీంతో నియోజకవర్గం పరిధిలోని వెల్మకన్నే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నా కొడుకుల్లారా.. మా కార్యకర్తలు వస్తే మీ వీపంతా పగుల్తదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
పోలీసులను కూడా లెక్క చేయలేదు రాజగోపాల్ రెడ్డి. వారిని కూడా తిట్టారు. ఇక అంతలోనే బీజేపీ గుండాలు.. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఇష్టం ఉన్నోళ్లే ఇక్కడ ఉండాలన్నారు. ఇష్టం లేనోళ్లు వెళ్లిపోయి మీ ప్రచారం మీరు చేసుకోండని రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఆటంకం కలిగించొద్దు. పోలీసులు ఏం చేస్తున్నారని వారిపై కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కారు. మర్యాద దక్కదు నా కొడుకా ఇక్కడ్నుంచి వెళ్లిపో అని కాంగ్రెస్ కార్యకర్తను హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి.
వీపంతా పగులగొడ్తా నా కొడుకుల్లారా ఎక్కువ నక్రాల్ చేస్తే అని నోరు పారేసుకున్నారు. పోనీ పాపం అనుకుంటే నక్రాల్ చేస్తున్నారు.. మర్యాద ఉండదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల వద్దకు నేను తీసుకొస్తే.. నన్నే అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.
