విధాత: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దిదారులందరూ మాకే ఓటేయ్యాలి. రైతుబంధు అందుకుంటున్న రాజగోపాల్ రెడ్డి కూడా మాకే ఓటేయ్యాలి. బరాబర్ అడుగుతామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల 40 వేల మంది ఓటర్లు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం […]

విధాత: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దిదారులందరూ మాకే ఓటేయ్యాలి. రైతుబంధు అందుకుంటున్న రాజగోపాల్ రెడ్డి కూడా మాకే ఓటేయ్యాలి. బరాబర్ అడుగుతామని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల 40 వేల మంది ఓటర్లు ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
— TRS Party (@trspartyonline) October 20, 2022
ఈ కార్యక్రమంలో మంత్రి @jagadishTRS తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు. pic.twitter.com/rWuSPwq3v0
అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దిదారులు 2,38,915(99.15 శాతం) మంది ఉన్నారని తెలిపారు. ఫలానా పని చేసిన అని ఓటు అడుగు. కానీ చిల్లరమల్లర మాటలు మాట్లాడొద్దు. కారుకూతలు కూయొద్దు. పిచ్చిమాటలు కాకుండా.. అర్థవంతమైన, హేతుబద్ధమైన మాటలు చెబితే మాట్లాడుదామన్నారు. మా పార్టీలో చేరితే రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తామని రాజగోపాల్ రెడ్డిని మోదీ, అమిత్ షా ప్రలోభపెట్టినట్లు.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరామని జగన్నాథంను నేను ప్రలోభపెట్టలేదన్నారు.
నేత కార్మికులకు మోదీ మరణ శాసనం రాసిండు.. మాతో ఉండండి అని జగన్నాథంకు చెప్పిన. మోదీ చేనేతకు సంబంధించిన అన్ని బోర్డులను రద్దు చేసిండు అని చెప్పిన. మా ప్రభుత్వ పథకాల లబ్దిదారులందరికీ ఫోన్ చేసి మాకు ఓటేయండి అని అడుగుతాను. ఆ హక్కు మాకుంది. అందుకే మాతో కలిసి రండి అని జగన్నాథంను కోరిన అందులో తప్పేముంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఓటు ఉందో, లేదో తెల్వదు. కానీ ఆయనకు కూడా రైతుబంధు వస్తున్నది. లెక్కకైతే ఆయన కూడా మాకే ఓటేయాలి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు రైతుబంధు, రైతుబీమా, తాగునీరు వస్తుంది. పని చేసి బరాబర్ ఓట్లు అడుగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
