Saturday, April 1, 2023
More
    HomelatestSukumar - Rajamouli | సుకుమార్ సాధించిన ఈ ఘనత.. రాజమౌళికి కూడా లేదు

    Sukumar – Rajamouli | సుకుమార్ సాధించిన ఈ ఘనత.. రాజమౌళికి కూడా లేదు

    ధాత‌, సినిమా: ఒకప్పుడు తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని డైరెక్టర్‌గా ప్రమోట్ చేయడంలో దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) నెంబర్ వన్ స్థానంలో ఉండే వారు. కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు, ర‌విరాజా పిన్ని శెట్టి ఇలా ఎందరో ఆయన శిష్యులుగా ఉన్నవారే. చివరకు ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) కూడా ఆ కోవకు చెందిన వ్యక్తినే.

    ఆ తరువాత అంత ఎక్కువగా అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్‌గా ప్రమోట్ చేసిన ఘనతను రాంగోపాల్ వర్మ సొంతం చేసుకున్నాడు. తాను చేసిన అతి తక్కువ చిత్రాలతోనే అతి ఎక్కువ మంది డైరెక్టర్లను తయారు చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు దక్కుతుంది. ఇక ఆ తరువాత రాజమౌళి (Rajamouli) కూడా సాధించలేని ఫీట్‌ను.. లెక్క‌ల మాస్టారు సుకుమార్ సాధించారు.

    రాజమౌళి శిష్యులు దర్శకులుగా సక్సెస్ సాధించలేకపోయారు. ఆ విషయంలో రాజమౌళి తన గురువు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) త‌ర‌హాలోనే అన్నమాట. కానీ ‘ఆర్య’ చిత్రంతో మెగా ఫోన్ చేతబట్టి రీసెంట్‌గా వచ్చిన ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయి క్రేజ్ తెచ్చుకున్నాడు.సుకుమార్ (Sukumar).

    ఈ లెక్కలు మాస్టారు దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ వచ్చాడు. మిగతా డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్ అందరికన్నా స్పెషల్. ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు పరిశ్రమలో డైరెక్టర్లుగా రాణిస్తున్నారు.

    ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన చాలామంది ఇప్పుడు దర్శకులుగా మారారు. సక్సెస్ సాధించారు. ‘ఉప్పెన’ చిత్రంతో ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మైన బుచ్చిబాబు సానా తొలి చిత్రంతోనే 100 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత చిత్రం రామ్ చరణ్‌తో చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ 270 కోట్లతో ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీ‌కాంత్ ఓదెల (Srikanth Odela) ‘ద‌స‌రా’ అనే సినిమా తీస్తున్నాడు.

    ఈ శ్రీ‌కాంత్ ఓదెల కూడా సుక్కు స్కూల్ నుంచి వ‌చ్చిన వాడే. ‘దసరా’ సినిమా విడుద‌ల కాకముందే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి శ్రీకాంత్ ఓదెల మంచి ఆఫర్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ చిత్రం ‘విరూపాక్ష’కు దర్శకుడు కార్తీక్ దండు. ఇతను కూడా సుకుమార్ శిష్యుడే. కుమారి 21 ఎఫ్, నిఖిల్ 18 పేజెస్ మూవీతో హిట్ల‌ను అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. వీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకే ఇప్పుడున్న దర్శకులలో సుకుమార్ చాలా చాలా స్పెషల్ అనేది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular