విధాత‌: ఎంతైనా పాశ్చాత్య దేశాల వారికి భారతీయులంటే ఒక చులకన భావం ఉంది. బయటకు మనం భారతీయులం అని గర్వంగా చెప్పుకుంటాం కానీ విదేశీయులు మాత్రం మనల్ని ఇంకా బానిస‌లుగా, న‌ల్ల‌వారిగా మాత్ర‌మే చూస్తూ.. ఇంకా అలానే భావిస్తున్నారు. వీలైనప్పుడల్లా మనల్ని అవమానించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విషయంలోకి వస్తే మన దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. లెజెండరీ దర్శకులైన మణిరత్నం, శంకర్ లకు కూడా కొన్ని డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ రాజమౌళికి […]

విధాత‌: ఎంతైనా పాశ్చాత్య దేశాల వారికి భారతీయులంటే ఒక చులకన భావం ఉంది. బయటకు మనం భారతీయులం అని గర్వంగా చెప్పుకుంటాం కానీ విదేశీయులు మాత్రం మనల్ని ఇంకా బానిస‌లుగా, న‌ల్ల‌వారిగా మాత్ర‌మే చూస్తూ.. ఇంకా అలానే భావిస్తున్నారు. వీలైనప్పుడల్లా మనల్ని అవమానించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

విషయంలోకి వస్తే మన దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. లెజెండరీ దర్శకులైన మణిరత్నం, శంకర్ లకు కూడా కొన్ని డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ రాజమౌళికి మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్లాప్‌ కూడా లేదు. ఇక రాజమౌళి తన చిత్రాలను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేస్తారు.

సినిమాలో చిన్న చిన్న తప్పులు దొర్లినప్పటికీ తనదైన కథాకథనాలతో మ్యాజిక్ స్క్రీన్‌ప్లే‌తో మాయ చేస్తూ ఉంటాడు. కానీ రాజమౌళిలోని అసలు ప్రతిభను బయటకు తీసుకు వచ్చిన చిత్రాలు మాత్రం మగధీర, ఈగ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈగ చిత్రం తర్వాత సాంకేతిక‌త ప‌రిజ్ఞానంపై రాజమౌళి తన దృష్టిని కేంద్రీకరించాడు.

గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక విలువలతో అత్యున్నత చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీకి అప్డేట్ అవుతున్నారు. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని తన చిత్రాలను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తున్నారు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రాజమౌళి క్రేజ్‌ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. ఈ చిత్రాలతో ఆయనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. అయితే ఇన్ని నెంబర్ వన్ బాక్సాఫీస్ రికార్డ్స్ రాజమౌళి పేరు మీద ఉన్నా.. ఆయన కెరీర్‌లో చిన్న వెలితి అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ రాక‌పోవ‌డం.

ఆడియన్స్ రివార్డ్స్, కలెక్షన్స్ రికార్డ్స్ భారీగా ఉన్నా.. అవార్డ్స్ విషయంలో రాజమౌళి వెనుకబడిపోయాడు అన్నది వాస్తవం. దాంతో ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆ లోటుని వడ్డీతో సహా తీరుస్తున్నాడు రాజ‌మౌళి. పోటీపడ్డ ప్రతి అంతర్జాతీయ వేదికలో ఈ చిత్రం అవార్డులను కొల్లగొడుతోంది. అత్యుత్తమ ఆస్కార్ అవార్డుకి అడుగు దూరంలో నిలబడింది. కానీ ఆయనంటే ఎందుకనో హాలీవుడ్ వారికి కాస్త ఈర్షగా ఉంది అని అనుమానం రాకమానదు. దాంతో హాలీవుడ్ మీడియా రాజమౌళిని ఇబ్బంది పెడుతూ వివాదాస్పద ప్ర‌శ్న‌లు సంధిస్తోంది.

మీ సినిమాలకు అవార్డులు ఎందుకు రావు? రివ్యూలు పాజిటివ్‌గా ఎందుకు ఉండవు? క్రిటిక్స్ ప్రశంసలు ఎక్కువగా రావెందుకు? కేవలం మీరు డబ్బుల కోసమే సినిమా తీస్తారా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నిజంగా ఈ ప్రశ్నలు విన్నప్పుడు ఇదేం పైత్యం అని అనిపించకమానదు. అఫ్‌కోర్స్.. వీటికి రాజమౌళి కూడా దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తున్నాడనుకోండి.

ఓ హాలీవుడ్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. నేను డబ్బుల కోసమే సినిమాలు చేస్తాను. కానీ విమర్శ‌కుల ప్రశంసల కోసం కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా కమర్షియల్ సినిమానే.

సినిమా కమర్షియల్‌గా మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తే చాలా సంతోషిస్తాను. కలెక్షన్లు మాత్రమే కాక అవార్డులు కూడా వస్తే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. అవార్డులు అనేవి మా యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం. అవార్డుల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.

Updated On 22 Jan 2023 12:52 PM GMT
krs

krs

Next Story