Blades | ఓ యువకుడు బ్లేడ్ ముక్కలను మింగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతను రక్తంతో కూడిన వాంతులను( Vomtings ) చేసుకున్నాడు. బాధిత యువకుడికి వైద్యులు( Doctors ) మూడు గంటల పాటు సర్జరీ( Surgery ) నిర్వహించి, ఆ బ్లేడ్ ముక్కలను తొలగించారు. ఈ ఘటన రాజస్థాన్( Rajasthan )లోని జలోర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. యశ్‌పాల్ సింగ్(26) అనే యువకుడు జలోర్ జిల్లా( Jalor Dist )లోని బాలాజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన నలుగురు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. యశ్‌పాల్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రులందరూ తమ పనులకు వెళ్లిపోయారు. యశ్‌పాల్ ఒక్కడే గదిలో ఉన్నాడు. ఉదయం 9:30 గంటల సమయంలో అతనికి వాంతులు అయ్యాయి. రక్తం పడటంతో తీవ్ర ఆందోళనకు గురైన యశ్‌పాల్ తన ఫ్రెండ్స్‌కు సమాచారం అందించాడు. హుటాహుటిన గదికి చేరుకున్న ఫ్రెండ్స్ యశ్‌పాల్‌ను మెడిప్లస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి సోనోగ్రఫీ నిర్వహించగా, కడుపులో బ్లేడ్( Blades ) ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. శరీరంలోని పలు అవయవాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు నిర్ధారించారు.
మూడు గంటల పాటు సర్జరీ..
యశ్‌పాల్‌కు ఏడుగురు వైద్యుల బృందం మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించి 56 బ్లేడ్ ముక్కలను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవాసీ మాట్లాడుతూ.. 56 బ్లేడ్ ముక్కలను దానికి ఉండే ప్లాస్టిక్ కవర్‌తో మింగేశాడు. కవర్ నుంచి బ్లేడ్ ముక్కలు వేరవడంతో.. శరీరంలోని లోపలి భాగాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. శరీరం కూడా వాచిపోయిందని, గొంతు లోపలి భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం యశ్‌పాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
బ్లేడ్ ముక్కలు ఎందుకు మింగాడు..?
యశ్‌పాల్ బ్లేడ్ ముక్కలు ఎందుకు మింగాల్సి వచ్చిందో తెలియడం లేదు. అతని కుటుంబ సభ్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని స్పష్టం చేశారు. ఒత్తిడికి గురైతేనే ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలు లేని యశ్‌పాల్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.