విధాత: చిన్నాచితకా పాత్రలు చేస్తున్న కమెడియన్ సునీల్ కు నువ్వే కావాలి చిత్రం మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఆ తరువాత చిరునవ్వుతో, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావు, సంతోషం, మల్లీశ్వరి వంటి ఎన్నో చిత్రాలలో ఆయన కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. అలా ఎన్నో వందల చిత్రాల్లో నటించి స్టార్ కమెడియన్ హోదాను అందుకున్న సునీల్ ఉన్నట్టుండి హీరోగా అవతారం దాల్చాడు. ఒకనాడు హీరోలకు స్నేహితునిగా ఉంటూ కామెడీ పండించిన సునీల్ తానే […]

విధాత: చిన్నాచితకా పాత్రలు చేస్తున్న కమెడియన్ సునీల్ కు నువ్వే కావాలి చిత్రం మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఆ తరువాత చిరునవ్వుతో, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావు, సంతోషం, మల్లీశ్వరి వంటి ఎన్నో చిత్రాలలో ఆయన కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. అలా ఎన్నో వందల చిత్రాల్లో నటించి స్టార్ కమెడియన్ హోదాను అందుకున్న సునీల్ ఉన్నట్టుండి హీరోగా అవతారం దాల్చాడు. ఒకనాడు హీరోలకు స్నేహితునిగా ఉంటూ కామెడీ పండించిన సునీల్ తానే హీరో అయ్యాడు.
ఈయన తనలోని నటుడిని బయటకు తెచ్చేందుకు నెగటివ్ స్టేట్స్ ఉన్నా ప్రతినాయక పాత్రలను కూడా ఒప్పుకుంటూ వస్తున్నాడనేది వాస్తవం. ఇలాంటి పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తే ఎంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఈయనకు తెలుసు. అలా ఆయన నెగటివ్ పాత్రలో నటించిన కలర్ ఫోటో, డిస్కో రాజా, పుష్ప1- ది రైజ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి.
ముఖ్యంగా పుష్ప చిత్రంలోని మంగళం శ్రీను పాత్ర ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఒక కమెడియన్‌లో ఇంతటి విలన్‌ని కూడా పోషించి మెప్పించే సత్తా ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రస్తుతం అంతా పుష్ప 2- ది రూల్ చిత్రంలో మంగళం శీను పాత్ర ఎలా ఉంటుంది? ఆయన దాక్షాయినితో కలిసి పుష్ప రాజుపై కసి తీర్చుకుంటాడా? ఏమి చేస్తాడు? అనే దానిపై చర్చ నడుస్తుంది.
ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో అందులో సునీల్ నటించిన మంగళం శీను పాత్రకు దేశంలోని అన్ని భాషల వారు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆయనకు ఇతర భాషల్లో కూడా మంచి మంచి వేషాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీల్ మరో జాక్‌పాట్ కొట్టాడు. ఎకంగా రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. సునీల్ గతంలో రజనీకాంత్‌తో ‘కథనాయకుడు’ చిత్రంలో కమెడియన్ నటించాడు.
ఇప్పుడు మరోమారు రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ చిత్రంలో ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. పుష్ప మంగళం శీను ఛాయలోనే ఇందులోను కనిపిస్తున్నాడు. బహుశా ఈ చిత్రంలో కూడా ఆయన విలన్‌గా నటిస్తున్నాడా మరేదైనా సర్ప్రైజ్ ఉంటుందా అనేది వేచి చూడాలి.
పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన మహామహులు నటిస్తున్నారు. ఇప్పటికే మళయాళం నుంచి మోహన్‌లాల్, కన్నడ నుంచి శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్‌లు విడుదల చేయగా తాజాగా సునీల్ లుక్ రిలీజ్ చేశారు.
కాగా జైలర్ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ప్రమోషన్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే వారానికొకరి చొప్పున ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్స్ రిలీవ్ చేస్తు వస్తున్నారు.
