విధాత, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. RRR చిత్రం తర్వాత ఆయన లెక్కే మారిపోయింది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అందరూ ఆయన నటనకు ఫిదా అయ్యారు. చిరంజీవి తనయునిగా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు.
RR చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో అద్భుతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చరణ్ నటనను మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.. పెడుతున్నారు. అయితే ఎవరు.. ఎలా మెచ్చుకున్నా.. చరణ్ మాత్రం ఎప్పటికీ ఆ ఇద్దరు హీరోయిన్లు అంటేనే ఇష్టం అంటున్నాడు. వారెవరని అనుకుంటున్నారా?
‘‘జూలియా రాబర్ట్స్.. నన్ను చాలా ఎట్రాక్ట్ చేసేది. టీవీలో ఆమె కనబడిన ప్రతిసారి స్క్రీన్‌కు అతుక్కు పోయేవాడిని. దాన్ని అబ్సెషన్ అంటారో లేదో తెలియదు కానీ ఆమెలో ఏదో స్పెషాలిటీ ఉంది. ఆమెకు డైహార్డ్ ఫ్యాన్‌ని నేను. ‘ప్రెట్టీ ఉమెన్’లో చూసి ఆమెతో ప్రేమలో పడిపోయాను.

‘ఎంట్రాప్ మెంట్’లో కేథిరిన్ యాక్టింగ్ చూసి ఫ్యాన్ అయిపోయాను. నేను ఆమెని ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె నటించిన ‘ది మాస్క్’ నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచే ఆమెని ఫాలో కావడం స్టార్ట్ చేశాను. ఆమెను చూసి కూడా ప్రేమలో పడిపోయాను. వారికి నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అంటూ చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చరణ్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.