Virat Kohli | సెలబ్రిటీల బయోపిక్స్ రూపొందుతుండడం వాటికి ఆడియన్స్ నుండి మంచి రియాక్షన్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మరి కొంతమంది ప్రముఖుల బయోపిక్స్‌కి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ బయోపిక్ విషయంలో అనేక వార్తలు వస్తున్నా కూడా దానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావడం లేదు. ధోని బయోపిక్ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు కోహ్లీ బయోపిక్ కూడా రూపొందుతుందనే ప్రచారం నడుస్తుంది. కోహ్లీ […]

Virat Kohli |
సెలబ్రిటీల బయోపిక్స్ రూపొందుతుండడం వాటికి ఆడియన్స్ నుండి మంచి రియాక్షన్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మరి కొంతమంది ప్రముఖుల బయోపిక్స్‌కి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ బయోపిక్ విషయంలో అనేక వార్తలు వస్తున్నా కూడా దానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావడం లేదు.
ధోని బయోపిక్ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు కోహ్లీ బయోపిక్ కూడా రూపొందుతుందనే ప్రచారం నడుస్తుంది. కోహ్లీ జీవితంలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 18 ఏళ్లకే తండ్రిని కోల్పోవడం, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని నేరుగా రంజీ మ్యాచ్ ఆడేందుకు వెళ్లడం, ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్‌గా 2008 అండర్ 19 వరల్డ్ కప్ విజయం సాధించడం, అదే ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకోవడం వంటివి విరాట్ జీవితంలో ఉన్నాయి.
రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, టీమిండియా వైస్ కెప్టెన్సీ, టెస్టు కెప్టెన్సీ, 2014 ఇంగ్లాండ్ టూర్‌లో అట్టర్ ఫ్లాప్, ఆ తర్వాతి టూర్‌లో సెంచరీల మోత, లవ్ ఎఫైర్స్, అనుష్క శర్మతో ప్రేమ, పెళ్లి.. హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలు, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో గొడవ,కెప్టెన్సీ కోల్పోవడం… ఫామ్ కోల్పోయి మూడేళ్లు సెంచరీ లేకుండా అనేక విమర్శల బారిన పడడం, ఆసియా కప్ 2022 సూపర్ సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు మరిన్ని పరుగులు చేస్తుండడం వంటివి ప్రేక్షకులకి మంచి ఆసక్తికరంగా ఉంటాయి.
విరాట్ కోహ్లీ పాత్రలో నటించడానికి చాలామంది బాలీవుడ్ హీరోలు సిద్దంగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అప్పట్లో రామ్ చరణ్.. విరాట్ కోహ్లీ బయోపిక్ చేయడానికి తాను సిద్ధంగా ఉంటున్నట్టు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ బయోపిక్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందడం ఖాయంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్.. ఈ సినిమా తర్వాత విరాట్ బయోపిక్ చేయనున్నట్టు సమాచారం. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న ఓ బ్యానర్.. రామ్ చరణ్‌తో విరాట్ కోహ్లీ బయోపిక్‌ను తీయడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.
