Wednesday, March 29, 2023
More
    Homelatestఅమెరికాలో రామ్ చరణ్ ఇంటర్వ్యూ.. ఇదబ్బా తెలుగోడి దెబ్బ!

    అమెరికాలో రామ్ చరణ్ ఇంటర్వ్యూ.. ఇదబ్బా తెలుగోడి దెబ్బ!

    విధాత‌, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ. గత మూడు రోజుల నుంచి ఆయన అమెరికాలో బిజీగా గడుపుతున్నాడు. RRR సినిమాతో రేంజ్ ఆమాంతం అంతర్జాతీయ స్థాయికి చేరింది.

    అమెరికా ప్రముఖ ఛానల్ అమెరికన్ బ్రాడ్ క్యాస్టింగ్ (ABC) కంపెనీలో ప్రసారమయ్యే గుడ్ మార్నింగ్ అమెరికా (GMA)షోకు అతిథిగా వెళ్లారు. ఇందులో సినిమా విషయాలు కాక వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని కోరికను బయట పెట్టారు.

    RRR సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఉక్రెయిన్‌లో అందమైన లోకేషన్‌లో షూటింగ్ చేశాం. షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియా వ‌చ్చిన తర్వాత ఒక టూరిస్ట్‌గా మరలా ఉక్రెయిన్‌కి వెళ్లాలని అనుకున్నాను.

    కానీ ఈ లోపే వార్ మొదలైంది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తే ఒక భారతీయుడిగా గర్వపడతాను. ఆస్కార్ అవార్డుల స్థాయికి భారతీయ సినిమాలు వస్తున్నాయి.. చాలా సంతోషకరమైన విషయమిది. సినిమాకు భాష ఉండదు. కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. సినిమా నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. డాన్స్ చేయిస్తుంది భయపెడుతుంది.. ఇలా అన్నీ చేయిస్తుందని రాజమౌళి చెప్పేవారని గుర్తు చేశారు.

    కొవిడ్ సమయంలో భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూశారు. కేవలం భారతీయ సినిమాలే కాకుండా హాలీవుడ్ చిత్రాలు చేయాలనుకుంటున్నాను.. అంటూ తన మనసులోని మాటను రామ్ చరణ్ బయట పెట్టాడు.

    ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాట కోసం 15 రోజులు పాటు చిత్రీకరిణ జరిపాం. ఆస్కార్ అవార్డుకు ఈ సాంగ్ ఉందని.. ఇది భారతీయ సినీ పరిశ్రమ సాధించే విజయమని చెప్పుకొచ్చాడు. ఇంకా తను తండ్రి కాబోతున్న విషయం గురించి చెబుతూ.. ఆ విషయం మొదట నేను తారక్‌తోనే షేర్ చేసుకున్నానని తెలిపారు.

    ప్రస్తుతం చరణ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్‌ని ‘గ్లోబల్‌స్టార్’ అని ట్రెండ్ చేస్తూ.. అమెరికాలో తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో చరణ్ చూపిస్తాన్నంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular