Bihar | విధాత: రామచరిత మానస్‌ కావ్యాన్ని పోటాషియం సైనెడ్‌తో పోల్చుతూ బీహార్‌ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయనిధి మారన్‌ సనాతన ధర్మంను కరోనా, డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చుతూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రేపిన దుమారం మరువకముందే బీహార్‌ మంత్రి రామచరిత మానస్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదస్పదం అవుతున్నాయి. పాట్నాలో జరిగిన హిందూ దివస్‌ కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మీరు 55వంటకాలు తయారు చేసి […]

Bihar |

విధాత: రామచరిత మానస్‌ కావ్యాన్ని పోటాషియం సైనెడ్‌తో పోల్చుతూ బీహార్‌ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉదయనిధి మారన్‌ సనాతన ధర్మంను కరోనా, డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చుతూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రేపిన దుమారం మరువకముందే బీహార్‌ మంత్రి రామచరిత మానస్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదస్పదం అవుతున్నాయి.

పాట్నాలో జరిగిన హిందూ దివస్‌ కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మీరు 55వంటకాలు తయారు చేసి అందులో పోటాష్‌ సైనెడ్‌తో కలిపితే దానిని మీరు తింటారా హిందూయిజం గ్రంథాల విషయంలో కూడా ఇదే జరుగుతుందన్నారు. బాబా నాగార్జున్‌, లోహియా సైతం దీనిపై విమర్శలు చేశారన్నారు.

రామచరిత మానస్‌పై నాకు బలమైన అభిప్రాయాలున్నాయని, అవి జీవితాంతం కొనసాగుతాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సైతం దీనిపై వ్యాఖ్యలు చేశారని చెప్పారు. మంత్రి చంద్రశేఖర్‌ గతంలో సైతం రామచరిత మానస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. కాగా రామచరిత మానస్‌పై బీహార్‌ మంత్రి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు ఈ మాటలు వినడబడుతు న్నాయా లేదా అని ప్రశ్నించింది.

మంత్రి చంద్రశేఖర్‌కు ఏవైనా అభ్యంతరాలుంటే ఆయన తన మతం మార్చుకోవచ్చని బీజేపీ ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ సలహా ఇచ్చారు. ఈ వివాదంపై స్పందించిన లోక్‌ జనశక్తి పార్టీ(రామ్‌ విలాస్‌ పాశ్వన్‌) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ స్పందిస్తూ వెంటనే అతడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Updated On 15 Sep 2023 3:28 PM GMT
krs

krs

Next Story