విధాత: క్రీడా స్ఫూర్తి అంటే మనం విజయం సాధించకపోయినా ఎదుటివారి విజయాన్ని అభినందించడం. తమతో పోరాడి గెలిచిన వారికి తమ వంతు ప్రోత్సాహం అందించడం. వారికి గౌరవాన్ని ఇవ్వడం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీకి అవార్డుల పంట పండుతోంది. తాజాగా అమెరికాలో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇందులో RRR కూడా ఒకటిగా పోటీలో నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తడాఖా చూపిస్తూ అత్యధిక వసూళ్లు సాధించింది.
పలు దేశాలలో రివార్డులు, కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా అవార్డుల విషయంలో కూడా రాణించింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును కీరవాణి అందుకున్నారు. కాగా అవార్డుల సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ చిత్రంలో హీరోలుగా నటించిన రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరుకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఈ హీరోలు తమ స్ఫూర్తిని చాటుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో భాగంగా అర్జెంటీనా 1985 చిత్రానికి గాను నాన్ ఇంగ్లీష్ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో అవార్డు లభించింది. ఈ సినిమాకు అవార్డు ప్రకటించగానే ఎన్టీఆర్ -రామ్ చరణ్‌లు నిలబడి చప్పట్లు కొట్టారు.
anya taylor-joy parándose para aplaudir al elenco de argentina 1985 cuando recibe el premio a mejor película extranjera #goldenglobes
pic.twitter.com/YVnagxG3kW— Anya Taylor-Joy Argentina (@anyataylorjoyar) January 11, 2023
ఈ వేడుకలో పాల్గొన్న వారిలో ఇలా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది వీరిద్దరే కావడం విశేషం. ప్రత్యర్థి చిత్రానికి అవార్డు వచ్చినా ఈగోను పక్కనపెట్టి RRR కూడా ఇందుకు నామినేట్ అయిన నేపథ్యంలో తమ పోటీ చిత్రానికి అవార్డు దక్కిన మన హీరోలు చూపించిన స్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తాజాగా RRR చిత్రం యూనిట్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో అవార్డు అందుకున్న అర్జెంటీనా 1985 సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు. మీ దేశం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంది.. గర్విస్తోంది అని ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.