Saturday, April 1, 2023
More
    Homelatestఏడుస్తున్న చిన్నారితో సెల్ఫీ.. రామ్‌చరణ్ గుండెలు పిండేశాడు

    ఏడుస్తున్న చిన్నారితో సెల్ఫీ.. రామ్‌చరణ్ గుండెలు పిండేశాడు

    విధాత‌: గతేడాది రామ్ చరణ్ నటించిన RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ బరిలోకి నామినేట్ అయ్యింది. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వేడుక కోసం 20 రోజుల ముందే అమెరికా చేరుకున్నాడు చరణ్. ఆమెరికా వెళ్లిన చరణ్ అక్కడ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అందులో భాగంగా వరల్డ్ పాపులర్ అయిన గుడ్ మార్నింగ్ అమెరికా (GMA) లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

    అయితే ఈ కార్యక్రమానికి చరణ్ వస్తున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ భారీ స్థాయిలో స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఇక ప్రోగ్రాం అనంతరం బయటకు రాగానే జనాలంత సెల్ఫీలు, షేక్ హాండ్ల కోసం చుట్టు ముట్టేశారు. జనాలను కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. చరణ్‌కి అందర్నీ కలిసే అవకాశం దొరకలేదు.

    ఈ నేపథ్యంలో చరణ్‌ని కలిసి సెల్ఫీ దిగడానికి ఓ చిన్నారి ఎంతగానో ప్రయత్నాలు చేసింది. అప్పటికే వెళ్లిపోదామని కారు దగ్గరకు వెళ్లిన చరణ్.. చిన్నారి ఏడుపు చూసి చలించి పోయాడు. వెంటనే ఏడుస్తున్న చిన్నారి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ దిగాడు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా న్యూయార్క్ లోనే టైం స్క్వేర్ దగ్గర జరిగినట్లు సమాచారం.

    కాగా చరణ్‌కి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. త్వరలోనే చరణ్ ఉపాసన దంపతులు పేరెంట్స్ కాబోతున్నారు. చరణ్ ఆ చిన్నారిని ఓదార్చి సెల్ఫీ దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ ఆచార్య అనే డిజాస్ట‌ర్ చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు చరణ్ ఓకే చేశాడు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular