మంత్రి మాట‌ల‌ను ఖండించిన బీజేపీ, హిందుత్వ సంస్థలు విధాత: తులసీదాస్‌ రచించిన రామ్‌చరిత మానస్‌ గ్రంథంపై బిహార్‌ విద్యాశాఖామంత్రి ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సమాజాన్ని చీల్చటానికే రామ్‌చరిత మానస్‌ పనిచేసిందని అందుకే దాన్ని వ్యతిరేకించాలని ఆయన అన్నారు. నలంద విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని కింది వర్గాలు విద్య నేర్చుకొంటే సమాజం విషతుల్యం అవుతుందని రామ్‌చరిత మానస్ పేర్కొన్నదని బిహార్‌ మంత్రి […]

  • మంత్రి మాట‌ల‌ను ఖండించిన బీజేపీ, హిందుత్వ సంస్థలు

విధాత: తులసీదాస్‌ రచించిన రామ్‌చరిత మానస్‌ గ్రంథంపై బిహార్‌ విద్యాశాఖామంత్రి ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సమాజాన్ని చీల్చటానికే రామ్‌చరిత మానస్‌ పనిచేసిందని అందుకే దాన్ని వ్యతిరేకించాలని ఆయన అన్నారు. నలంద విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సమాజంలోని కింది వర్గాలు విద్య నేర్చుకొంటే సమాజం విషతుల్యం అవుతుందని రామ్‌చరిత మానస్ పేర్కొన్నదని బిహార్‌ మంత్రి ప్రొ. చంద్రశేఖర్‌ వివరించారు.

అలాగే… మనుస్మృతి, గోల్వాల్కర్‌ రచించిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ లాగే రామ్‌చరిత మానస్‌ కూడా సమాజాన్ని చీల్చటానికీ, ప్రజల్లో వైషమ్యాలు పెంచటానికి దోహదం చేశాయని అన్నారు. అందుకే వీటిని ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు.

బీహార్‌ విద్యాశాఖా మంత్రి మాటలపై బీజేపీ, వివిధ హిందుత్వ సంస్థలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. మంత్రి మాటల‌ను ఖండించాయి.

Updated On 12 Jan 2023 10:14 AM GMT
krs

krs

Next Story