Saturday, January 28, 2023
More
  Homelatestఎవ‌రైనా.. బుద్ధి వంకరే! చీర లేకుంటే స్త్రీలు మ‌రింత అందంగా ఉంటారు: రాందేవ్ బాబా

  ఎవ‌రైనా.. బుద్ధి వంకరే! చీర లేకుంటే స్త్రీలు మ‌రింత అందంగా ఉంటారు: రాందేవ్ బాబా

  విధాత‌: కాషాయ వ‌స్త్రాలు ధ‌రించినంత మాత్రాన వారి మ‌నో భావాల్లోని మ‌లినం మాయం అయిపోద‌ని మ‌రోసారి రుజువైంది. రాందేవ్ బాబా ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. స్త్రీలు చీర ధ‌రిస్తే అందంగా ఉంటారు, అది ధ‌రించ‌కున్నా కూడా మ‌రింత అందంగా ఉంటార‌ని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

  యోగా గురూగా దేశ దేశాల్లో ఖ్యాతి గాంచిన ఆయ‌న సాధు స‌న్యాసిగా స‌మాజంలో గౌర‌వం పొందుతున్నారు. సాధు వేశంలో ఉండి మ‌హిళ‌ల ప‌ట్ల ఇంత నీచంగా మాట్లాడ‌టంతో స‌మాజంలో ముఖ్యంగా మ‌హిళ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హ‌వేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచిన రాందేవ్ బాబా బే ష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల్లోంచి కాషాయ‌ధారుల‌ను భార‌తీయులు ఎంతో గౌర‌విస్తారు, పూజిస్తారు. కానీ ప్ర‌జ‌ల విశ్వాసాల‌ను, న‌మ్మ‌కాన్ని ఆస‌రా చేసుకొని ఎన్నో దుర్మార్గాల‌కు దిగిన వారున్నారు. ఆ క్ర‌మంలోనే కాషాయ దుస్తులు ధ‌రించి కాని ప‌నులు ఎన్ని చేశారో ఎంత మంది చేశారో కూడా అనేక ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. సాధు వేశంలో ఉండి హ‌త్య‌లు, అత్యాచారాలు చేసిన‌ ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు.

  కాషాయ వ‌స్త్రాలు ధ‌రించి ప‌తంజ‌లి ఆయుర్వేద ఉత్ప‌త్తుల బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొన్న బాబా రాందేవ్, యోగా గురువుగా కూడా పేరుగాంచారు. అధికార బీజేపీ పార్టీ అండ‌దండ‌ల‌తో ఆయ‌న ఆచ‌ర‌ణ అంతా వివాదాస్ప‌దమే. ఈ క్ర‌మంలో సాధు స‌న్యాసుల వికృత చేష్ట‌లు, వంక‌ర బుద్ధి జాబితాలో రాందేవ్ బాబా మొద‌టి వాడూ కాదు, చివ‌రి వాడూ కాదు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular